DoubleIsmart : రిలీజ్ అయిన బిగ్ బుల్ సాంగ్.. ఆ సాంగ్ ని గుర్తుచేసేలా ఉంది?

DoubleIsmart : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు డబుల్ ఇస్మార్ట్ పేరిట సీక్వెల్ సినిమా వస్తుంది. ఇక సినిమాకి సంబంధించిన మొత్తం పనులన్నీ పూర్తయి ఆగష్టు 15న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కి రెడీ అవుతుంది. నిజానికి డబుల్ ఇస్మార్ట్ సమ్మర్ లోనే రావాల్సి ఉండగా, షూటింగ్ డిలే వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక డబుల్ ఇస్మార్ట్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇవ్వగా, లేటెస్ట్ గా బిగ్ బుల్ పేరిట మరో సాంగ్ రిలీజ్ అయింది. కాసేపటికిందే రిలీజ్ అయిన ఈ పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Double Ismart Big Bull Song Out Now

ఆకట్టుకుంటున్న బిగ్ బుల్ మాస్ అంతెం..

ఇక డబుల్ ఇస్మార్ట్ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోగా తాజాగా బిగ్ బుల్ పేరిట సాంగ్ కూడా రిలీజ్ చేసారు. డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్లు ముంబైలో చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సాంగ్‌ను అక్కడ లాంచ్ చేశారు. ఇక ఈ సినిమాలో బిగ్ బుల్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నాడు. కాగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో రామ్ సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వగా, రామ్ మరోసారి తనదైన మాస్ స్వాగ్‌తో ఈ సాంగ్ ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లనున్నట్లు సాంగ్ చూస్తే అర్థమవుతోంది. ఈ సాంగ్ ని భాస్కరబట్ల రాయగా, మణిశర్మ మాస్ ట్యూన్స్‌ను కంపోజ్ చేశారు. అయితే ఈ సాంగ్ చూస్తున్న తెలుగు ఆడియన్స్ కి మాత్రం మరో సాంగ్ గుర్తుకు రాకమానదు.

- Advertisement -

థార్ మార్… సాంగ్ లా బిగ్ బుల్..

ఇక బిగ్ బుల్ సాంగ్ చూస్తున్నంత సేపు తెలుగు ఆడియన్స్ కి మాత్రం రెండేళ్ల కింద వచ్చిన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో ‘థార్ మార్’ సాంగ్ గుర్తుకువస్తుంది. ఆ సాంగ్ లో చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటించారు. ఆ సాంగ్ కూడా అంతెం సాంగ్ లా రిలీజ్ అయి సినిమాపై మంచి అంచనాలు పెంచగా, సాంగ్ హిట్ అయినా, సినిమా మాత్రం ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. పైగా ఆ సాంగ్ సినిమా మొత్తం అయిపోయాక వస్తుంది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన బిగ్ బుల్ సాంగ్ చూస్తున్నా అలాగే అనిపిస్తుంది. ఈ సాంగ్ లో రామ్, సంజయ్ దత్ కలిసి కనిపించగా, బ్యాక్ సైడ్ లో సినిమాకి పని చేసిన ఆర్టిస్టులందరూ ఉన్నారు. ఇక హీరో కాస్ట్యూమ్స్ కూడా థార్ మార్ సాంగ్ లో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఇక ఈ సాంగ్ కూడా చూస్తుంటే సినిమా ఫినిష్ అయ్యాకే ఎండింగ్ లో ప్లే చేస్తారని తెలుస్తుంది. మరి ఆ సినిమాకి వర్కౌట్ కానీ అంతెం సాంగ్ సెంటిమెంట్, డబుల్ ఇస్మార్ట్ కైనా వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు