Double Ismart : డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో రామ్ కే దమ్కీ ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

Double Ismart : డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ వీళ్లిద్దరి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో మరో మూవీని రూపొందిస్తున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ మొత్తం ఒకెత్తు అయితే, అందులో బోల్డ్ లుక్ లో యాక్షన్ మోడ్ లో కనిపించిన అమ్మాయి మరొక ఎత్తు అని చెప్పాలి. టీజర్ లో ఉన్న హైలెట్స్ లో ఈ బ్యూటీనే మెయిన్ హైలెట్ గా నిలిచింది. మరి ఇంతకీ డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో హీరోకే దమ్కీ ఇచ్చిన ఈ అమ్మడు ఎవరు? అనే వివరాల్లోకి వెళితే…

హీరోయిన్ కంటే ఆమే హైలెట్…

డబుల్ ఇస్మార్ట్ టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది. పూరి జగన్నాథ్ మార్క్ ఇందులో కనిపించగా, ఫస్ట్ పార్ట్ లో ఉన్న ట్రాక్ ని సీక్వెల్ లో కూడా రిపీట్ చేశారు. ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీకి హై ఇచ్చిన శివ ట్రాన్స్ ను ఈ సీక్వెల్ లో కూడా యాడ్ చేసినట్టు టీజర్ లో చూపించారు. టీజర్ లో హీరోయిన్ కావ్య టాపర్ ను గ్లామర్ లుక్ లో చూపించారు. అయితే ఆమె కంటే ఎక్కువగా మరో అమ్మాయి హైలెట్ అయ్యింది. డబుల్ ఇస్మార్ట్ టీజర్ మొదట్లో రామ్ ని బలవంతంగా హాస్పిటల్ బెడ్ పైకి తోస్తూ కోపంగా చూసే ఆ అమ్మాయి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజెన్లు. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అంటే…

ఆ అమ్మాయి ఎవరంటే?

డబుల్ ఇస్మార్ట్ టీజర్ లో మెరిసిన ఆ అమ్మాయి పేరు బాని జె అని సమాచారం. గుర్బాని జడ్జ్ అనేది ఆమె పూర్తి పేరు. ఆప్కా సురూర్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత జొరావత్ అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. తెలుగులో కూడా ఈ బ్యూటీ ఓ సినిమాలో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తిక్క సినిమాలో బాని ఓ పాత్రలో కనిపించింది. అంతేకాదు తమిళ ప్రేక్షకులకు కూడా వలిమై అనే భారీ సినిమాతో తనను తాను పరిచయం చేసుకుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాని ఓ కీలక పాత్రలో మెరిసింది.

- Advertisement -

ఇలా ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క డబుల్ ఇస్మార్ట్ టీజర్ తోనే వచ్చేసింది ఈ బ్యూటీకి. మరి టీజర్లోనే ఆమెను హైలెట్ చేశారా? లేదంటే సినిమాలో కూడా ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉందా? అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత బాని కెరీర్ తెలుగులో ఎలా టర్న్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ముందు ముందు ఈ బ్యూటీకి టాలీవుడ్ నుంచి మరిన్ని మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు