Double Ismart First Review : డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే…?

Double Ismart First Review : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన సినిమా డబల్ ఇస్మార్ట్ శంకర్. ఇదివరకు కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చింది. వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తున్న పూరీ జగన్నాథ్ కెరీర్ కు ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు తీయడానికి పూరి జగన్నాథ్ కి ధైర్యం వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా దాదాపు ఫెయిల్ అయిపోయాయి. ఇంక లైగర్ సినిమా పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ద్వారా విపరీతంగా నష్టపోయాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఒక హిట్ సినిమా చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి చేసిన సినిమా డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజెస్ ఉంటాయని సమాచారం వినిపిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. హీరో హీరోయిన్ మంచి కెమిస్ట్రీ బ్యూటిఫుల్. అలానే మదర్ సెంటిమెంట్ ఈ సినిమాలో కీలకం కానుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఈ సినిమాల్లో బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత పూరి సినిమాలో ఆలీ ట్రాక్ ను పెట్టారు, ఇది కూడా ఈ సినిమాకి ఒక రకమైన ప్లస్. మొత్తానికి ఈ సినిమాతో పూరి జగన్నాథ్ హిట్ కొడతాడు అని చెప్పొచ్చు.

Double Ismart

- Advertisement -

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఉన్న పరిస్థితులు హిట్ సినిమా అనేది చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితేనే మళ్లీ సినిమాలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాల్సిన అమౌంట్ విషయంలో కూడా ఇంకా సమస్యలు క్లియర్ కాలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన ఈ సినిమాకి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయలేకపోతున్నారు. కానీ సినిమా మాత్రం మంచి ప్రమోషన్స్ జరిగి రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.

పూరి జగన్నాథ్ అప్కమింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే జనగణమన అనే సినిమాను తేజ తో చేస్తాడు అని వార్తలు వచ్చాయి. మొదటి ఆ సినిమాను మహేష్ బాబుతో అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ చేశారు. ఇప్పుడు తేజ పేరు వినిపిస్తుంది. ఏదేమైనా పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. అది ఎవరితో జరుగుతుందో ఎంత పెద్ద హిట్ ఆ పోతుందని కూడా కొంతమంది పూరీ అభిమానులకి ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు