Double Ismart: హనుమాన్ నిర్మాతలను నిండా ముంచేసిన డబుల్ ఇస్మార్ట్.. దెబ్బ పడిందిగా..!

Double Ismart.. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని కావ్య థాపర్ జంటగా నటించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. భారీ అంచనాల మధ్య ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అత్యంత ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. గతంలో పూరీ జగన్నాథ్ , రామ్ పోతినేని, నిధి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఇది. ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని అందించడమే కాదు అప్పటివరకు చాక్లెట్ బాయ్ లా కనిపించిన రామ్ పోతినేని ఒక్కసారిగా ఇందులో మాస్ హీరోగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ సినిమాతో హీరో రామ్ కి ఊహించని ఇమేజ్ లభించింది నిధి అగర్వాల్ కూడా స్టార్ స్టేటస్ లో సొంతం చేసుకుంది. ఇక అదే రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సినిమా తీశారు కానీ మొదటి సినిమానే అటు తిప్పి ఇటు తిప్పి తెరకెక్కించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Double Ismart: Hanuman's producers were overwhelmed by Double Ismart.. But it got hit..!
Double Ismart: Hanuman’s producers were overwhelmed by Double Ismart.. But it got hit..!

నిండా మునిగిపోయిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్..

అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ నష్టాలను చవిచూసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేటర్ హక్కులను రూ.54 కోట్లకు కొనుగోలు చేసింది.గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రం రెండంకెల షేర్ మార్క్‌ను అధిగమించడానికి కూడా కష్టపడుతోంది. ఈ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు ఈ సినిమా భారీ నష్టాన్ని మిగిల్చింది. మరి ఈ పరిస్థితిని కంపెనీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మొత్తానికైతే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ డబుల్ ఇస్మార్ట్ సినిమా హక్కులను కొనుగోలు చేసి ఘోర పరాభవాన్ని , నష్టాన్ని చవిచూసిందని చెప్పవచ్చు.

హనుమాన్ చిత్రంతో భారీ సక్సెస్..

ఇకపోతే ఈ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఏడాది యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలకు కూడా పోటీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించింది హనుమాన్ చిత్రం. ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు భారీ నష్టాన్ని చవిచూసిందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఈ సినిమాను నమ్ముకున్న రామ్ పోతినేని కి కూడా గట్టి దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.

- Advertisement -

సక్సెస్ కోసం పోరాటం..

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఈయనకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. అందులో భాగంగానే రామ్ నటించిన రెడ్ , వారియర్ , స్కంద చిత్రాలు కూడా ఘోరమైన పరాభవాన్ని చూసాయి. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న డబుల్ ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ మేరకు ఈయన నెక్స్ట్ కథల ఎంపిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు