Double Ismart: పూరి చెప్పిన రేంజ్ లో ఈ సాంగ్ ఉందా.?

Double Ismart: మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ని ఇచ్చాడు మణిశర్మ. మణిశర్మ మ్యూజిక్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో మణిశర్మ హవ కొంతమేరకు తగ్గింది. మెగాస్టార్ తో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ కూడా మణిశర్మ కెరియర్ కు కొద్దిపాటి మైనస్ గా మారింది. ఇప్పటికీ మణిశర్మ మ్యూజిక్ వలన హిట్ అయిన సినిమాలు ఉన్నాయని అంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి సినిమాకి తన వంతు డ్యూటీ చేస్తూనే ఉంటాడు మణిశర్మ. కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఏరోజు మణిశర్మ మ్యూజిక్ మాత్రం ఫెయిల్ కాలేదు. దీనికి గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు వీరశంకర్ దర్శకత్వంలో వచ్చిన గుడుంబా శంకర్ వంటి సినిమాలు ఉదాహరణలుగా చెప్పొచ్చు.

ఇకపోతే చాలామంది దర్శకులతో మణిశర్మకు మంచి అనుబంధం ఉంది. అలానే పూరి జగన్నాథ్ మణిశర్మ కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబల్ ఇస్మార్ట్ అనే సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే రెండు పాటలు కూడా మణిశర్మ రేంజ్ లో లేవు అనేది కొంతమంది అభిప్రాయం. ఇవి కూడా మణిశర్మ అని విపరీతంగా ఇష్టపడి మణిశర్మ క్యాపబిలిటీ తెలిసిన సంగీత ప్రియులు చేసిన కామెంట్స్ అని చెప్పొచ్చు.

Puri With Manisharma

- Advertisement -

ఈ సినిమా నుంచి రీసెంట్ గా మార్ అంతా చోడ్ చింత అని ఒక పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఆ సినిమాలో దిమాక్ ఖరాబ్ అనే సాంగ్ మంచి హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ గా చేస్తున్న ఈ సినిమాలో సాంగ్ ఆ సినిమాను మర్చిపోయాలా ఉండాలి అని చెప్పాడట పూరి జగన్నాథ్. వాస్తవానికి ఆ పాట ఎవరికి గుర్తులేదు. ఎందుకంటే అంతకు మించిన చాలా బ్లాక్ బస్టర్ హిట్ పాటలు మణిశర్మ ఇచ్చారు. ఇక పూరి జగన్నాథ్ వెర్షన్ ప్రకారం ఇప్పుడు రిలీజ్ చేసిన పాట దానిని మించి ఉంది అని. ఈ పాటను సింగిల్ స్క్రీన్ థియేటర్లో చీటీలు ఎగరేస్తూ చూడాలి అంటూ ఒక అఫీషియల్ వీడియోను రిలీజ్ చేశాడు పూరి జగన్నాథ్. వాస్తవానికి ఈ పాట కొంతమందికి మాత్రమే ఎక్కింది తప్ప మణిశర్మ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ని నిజంగా ఇష్టపడే ఆడియన్ ను అంతగా ఆకట్టుకోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు