Double Ismart: అక్కడ కూడా సేమ్ డేట్ దెబ్బకు లైగర్ మర్చిపోవాలి

Double Ismart: పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ టాలెంట్ ఏంటో ఎప్పుడో తెలుగు ప్రేక్షకులు చూశారు ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశారు. పూరి జగన్నాథ్ సినిమాలంటేనే క్యారెక్టరైజేషన్ కి ఈజీగా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. పూరి సృష్టించిన ఎన్నో క్యారెక్టర్స్ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. అయితే టెంపర్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ పూరి జగన్నాది ఇప్పటివరకు సాధించలేదు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా హిట్ అయినా కూడా చాలామంది పూరి అభిమానులకి ఆ సినిమా అంతగా నచ్చలేదు.

లేకపోతే ఎప్పుడో అమితాబచ్చన్ తో ఒక సూపర్ హిట్ సినిమాను బాలీవుడ్ లో చేసి సక్సెస్ సాధించాడు పూరి. ఇక మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో తన టాలెంట్ చూపిద్దామని ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇంక తెలుగు ప్రాక్టీలకు పూరీ జగన్నాథ్ టాలెంట్ తెలుసు కానీ నార్త్ లో పూరి అసలు టాలెంట్ ఏంటో ఇంకా బయటపడలేదు. ఇప్పుడు కచ్చితంగా పూరి జగన్నాథ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పూరి దర్శకత్వం వహించిన డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Liger - Saala Crossbreed

- Advertisement -

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన స్త్రీ 2, అక్షయ్ కుమార్ యొక్క ఖేల్ ఖేల్ మే, మరియు జాన్ అబ్రహం వేదా ఆగస్ట్ 15, 2024న పెద్ద రిలీజ్ అవుతున్నాయి. వీటిలో, స్త్రీ 2 సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇంక ఈ సినిమాలు మధ్య డబల్ ఇస్మార్ట్ సినిమా పడి బ్లాక్ బస్టర్ అయితే పూరి టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. రామ్ పోతినేని సినిమాలకు నార్త్ లో ఎంత ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటివరకు రామ్ పోతినేని చేసిన పది సినిమాలు 100 మిలియన్స్ దాటి వ్యూస్ వచ్చాయి. ఇక రామ్ సినిమా బిగ్ స్క్రీన్ లో వస్తుంది అని అంటే అక్కడ ఆడియన్స్ కూడా క్యూరియాసిటీతో ఉంటారు. ఇంక సినిమా వర్క్ అవుట్ అయితే పూరీకి బ్లాక్ బస్టర్ పడి బౌన్స్ బ్యాక్ అయినట్లే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు