Double Ismart: ఏ రకంగా చూసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా కంటే బచ్చన్ సినిమాకు కలిసొస్తుంది

Double Ismart: పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా డబల్ ఇష్మార్ట్. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా వచ్చింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో పూరి ఒక సక్సెస్ చూశాడు. ఈ సినిమాకి మల్టీప్లెక్స్ లో మొదట నెగిటివ్ టాక్ వచ్చినా కూడా చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పెట్టారు. ఈ సినిమా తర్వాత పూరి చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే మిగిలాయి. ఈ సినిమా తర్వాత పూరి కనెక్ట్స్ నుంచి మెహబూబా, రొమాంటిక్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత పూరి దర్శకత్వంలో లైగర్ అనే సినిమా కూడా వచ్చింది.

లైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొడతారని అందరూ ఊహించారు. కానీ ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది. ఇకపోతే ఇప్పుడు అందరు చూపులు కూడా డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా పైన ఉన్నాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు సరైన ప్రమోషన్ కూడా చేయలేదు. మరోవైపు రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ చిత్ర యూనిట్ ఇప్పటివరకు సినిమా నుంచి మూడు పాటలను ఒక టీజర్ రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మెల్లగా డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి ఫోకస్ మిస్టర్ బచ్చన్ వైపు షిఫ్ట్ అవుతుంది.

Mr Bachchan

- Advertisement -

ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెన్సార్లు పూర్తి చేసుకున్నాయి. డబల్ ఇస్మార్ట్ సినిమాకు A సర్టిఫికెట్, మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి U/A సర్టిఫికెట్ వచ్చాయి. ఇక చాలామందికి మిస్టర్ బచ్చన్ సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి. ఏ రకంగా చూసినా కూడా ఈ సినిమాకి అన్ని కలిసి వస్తున్నాయి. ఇప్పుడు సెన్సార్ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది. ఇది పూరి జగన్నాథ్ కి హరీష్ శంకర్ కి ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడుగా హరీష్ మొదటి ఫెయిల్ అయిన తర్వాత రచయితగా మళ్లీ పూరి జగన్నాథ్ దగ్గర పని చేశాడు. పూరి గారిని తన గురువుల భావిస్తుంటాడు హరీష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు