Telugu theatre issues : నేడు ఎగ్జిబిటర్ల మీటింగ్ , చర్చించే అంశాలు ఇవే

Telugu theatre issues : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయి. అలానే సినిమాని నమ్ముకున్న వాళ్లు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో చాలా థియేటర్స్ కళ్యాణ మండపాలుగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా మీద చాలామందికి ఆసక్తి ఉండేది థియేటర్ కు ఆడియన్స్ ఎగబడి వచ్చేవారు. కానీ రీసెంట్ టైమ్స్ లో సినిమాకి రావడం తగ్గించేశారు చాలామంది ఆడియన్స్. దీనికి చాలా రకమైన కారణాలు ఉన్నాయి. సినిమా టిక్కెట్ రేట్లు తో పాటు సినిమా ఇంటర్వెల్ లో దొరికే పాప్కాన్ వరకు కూడా చాలా సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి.

ఇకపోతే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఆఫీస్ ప్రాంగణములో థియేటర్ యజమానులకు కంట్రోలర్ కు మీటింగ్ జరగనుంది. నేడు 10 గంటలకు ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో లైగర్ అడ్వాన్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పర్సంటేజ్ వంటి అంశాలను చర్చించనున్నారు. టైగర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తీవ్రంగా నష్టపోయారు.

Vijay Deverakonda's Liger

- Advertisement -

కేవలం పూరి జగన్నాథ్ మాత్రమే కాకుండా ఈ సినిమాను కొనుక్కుని డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒక సందర్భంలో దీనికి సంబంధించి పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా కూడా చేద్దామని అనుకున్నారు. ఆ టైంలో పూరి జగన్నాథ్ ఆడియో ఒకటి సంచలనగా మారింది. పూరి వెర్షన్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. ఏదేమైనా నేడు జరుగుతున్న ఈ మీటింగ్ తో చాలా సమస్యలు ఒక కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్ ను తెలంగాణ తెలుగు సినిమా ఎక్సిభిటర్ & కంట్రోలర్ అసోసియేషన్ నిర్వహిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు