DoubleIsmart : డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. ఇక దీనిపైనే పూరి హోప్స్?

DoubleIsmart : టాలీవుడ్ లో వచ్చే వారం రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ఒకటి. రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిందని తెలిసిందే. ఇక ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక హీరో రామ్ పోతినేని, అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇద్దరూ వరుస ప్లాపుల్లో ఉన్న నేపథ్యంలో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో సీక్వెల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా సెన్సార్ కార్యక్రమాలు కూడా ముగించుకున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆగ‌స్టు 15న రిలీజ్ చేస్తున్నారు.

Double Ismart Pre Release Event Date Fix

ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేసుకున్న డబుల్ ఇస్మార్ట్..

ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి సంబంధించి లేటెస్ట్ గా క్రేజీ అప్డేట్ వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 11న హన్మకొండ లో JNS ఇండోర్ స్టేడియమ్ లో జరపనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ జరగనున్నట్టు ప్రకటించారు. అయితే ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చేది ఎవరో క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎవరైనా వస్తున్నారా? లేదా చిత్ర యూనిట్ మాత్రం ఈవెంట్ లో సందడి చేస్తారా అనేది కూడా తెలీదు.

- Advertisement -

పూరి హోప్స్ దీనిపైనే?

అయితే డబుల్ ఇస్మార్ట్ కు సీక్వెల్ అన్న హైప్ మినహా ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రోమోలతో ఆశించినంత హైప్ రాలేదన్న మాట వాస్తవం. పాటలు ఆకట్టుకునేంత కొత్తగా లేకపోగా, ట్రైలర్ మొత్తం పాత సినిమానే గుర్తు చేస్తుంది. ఇక చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్లు ఇంటర్వ్యూలలో కూడా అంత సందడి ఏమి కనిపించలేదు. కానీ మరో వైపు అదే రోజు విడుదలవుతున్న రవితేజ మిస్టర్ బచ్చన్ కి మాత్రం ఓ రేంజ్ లో హైప్ ఇప్పటికే వచ్చేసింది. హరీష్ శంకర్ కేవలం ఇంటర్వ్యూ లతోనే హైపెక్కించగా, ట్రైలర్ ని కూడా ఆకట్టుకునేలా డిజైన్ చేసాడు. ఇక దీంతో పోల్చుకుంటే డబుల్ ఇస్మార్ట్ కి అంతగా హైప్ లేదు. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలనీ పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నాడు. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు