Double Ismart: స్టెప్పా మార్ కాదు పూరి గారు, ముందు మీరు మారండి, ఇది నిజంగానే మణిశర్మ చేసారా.?

Double Ismart: ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంటే వారిలో పూరి జగన్నాథ్ పేరు వినిపించేది. పూరి జగన్నాథ్ సినిమా అంటే ఆ మాస్ కమర్షియల్ క్యారెక్టర్రైజేషన్ తో పాటు అద్భుతమైన డైలాగ్స్, మ్యానరిజమ్స్ , ఆలీ కామెడీ ట్రాక్ ఇలా చాలా ఉండేది. అయితే పూరి జగన్నాథ్ కి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ సినిమాలలో ఇప్పటివరకు అద్భుతమైన పాటలు కూడా వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో పూరి జగన్నాథ్ హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయిందని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు పూరి కెరీర్ లో ఒక హిట్ సినిమా కూడా లేదు.

చక్రితో ప్రయాణం

ప్రతి దర్శకుడికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ సినిమాలకి చక్రి సంగీతం అందిస్తూ ఉండేవాడు. చక్రి అందించిన సంగీతం పూరి జగన్నాథ్ సినిమాలలో అద్భుతంగా వర్కౌట్ అయ్యేది. అలానే సినిమాకి సంబంధించిన పాటలను కూడా బయట ఎక్కడపడితే అక్కడ వినిపిస్తూ ఉండేవి. అలానే చాలామంది సంగీత దర్శకులతో పనిచేశాడు పూరీ జగన్నాథ్. ఇక పూరీ జగన్నాథ్ మణిశర్మ కాంబినేషన్ లో కూడా అద్భుతమైన పాటలు వచ్చాయి.

బ్లాక్ బస్టర్ పోకిరి

మణిశర్మ సంగీతం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో వచ్చిన సినిమాలలోని పాట కూడా ఇప్పటికీ పాడుకోగలిగేలా కంపోజ్ చేశారు మణిశర్మ. మణిశర్మ అందించిన సంగీతం వినడానికి ఎంత హాయిగా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్బస్టర్ సాంగ్స్ ను కంపోజ్ చేశారు మణిశర్మ. అలానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాకి కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పోకిరి సినిమాలో ప్రతి పాట కూడా అద్భుతంగా ఉంటుంది. అలానే ఇస్మార్ట్ శంకర్ కి కూడా మంచి పాటలను ఇచ్చారు.

- Advertisement -

Double Ismart 1st single

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్

ఇక రీసెంట్ గా పూరి జగన్నాథ్ మణిశర్మ కలిసి పనిచేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. స్టెప్పా మార్ అనే ఈ పాట ను మణిశర్మ కంపోజ్ చేశారు అంటే నమ్మేలా లేదు. అది పూరి జగన్నాథ్ వంటి దర్శకుడు మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న పాట అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలని మినిమం రిచ్ కాలేకపోయింది ఈ పాట. ఏదో నామమాత్రంగా చేసి వదిలేయాలి అనేటట్లుగా ఈ పాట చేశారని అనిపిస్తుంది. ఇకపోతే సినిమా వర్కౌట్ అయితే పాటలు గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ సినిమా వరకు ఒక ప్రేక్షకుడిని తీసుకెళ్లాలంటే పాటలు చాలా ముఖ్యం. కాబట్టి ముందు ముందు రిలీజ్ చేయబోయే పాటలు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సినిమాకి చాలా మంచిది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు