Double Ismart : పూరి ఛార్మీ కష్టాలకు ఎండ్ కార్డ్…. ఈ వారం ఓ కొలిక్కి రానుందా…?

Double Ismart : ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఒక వైపు రామ్ పోతినేనికి సరైన హిట్ సినిమా పడలేదు. మరోవైపు పూరి జగన్నాథ్ కూడా సరైన హిట్ సినిమా పడలేదు. వీరిద్దరూ కలిసి మరోసారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ ను కూడా 4వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మామూలుగా ఒక సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది అనగానే 30 రోజుల ముందు నుంచి హడావిడి స్టార్ట్ అవుద్ది. కానీ ఈ సినిమాకి సంబంధించి నార్మల్ గా ట్విట్టర్లో అప్డేట్స్ ఇస్తున్నారు తప్ప, పెద్దగా మీడియా ముందుకు వచ్చి హడావిడి చేయట్లేదు. పూరి సినిమా రిలీజ్ రెడీగా ఉంది అనగానే చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. అలానే రామ్ కూడా సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ జోష్ తో పాల్గొంటాడు. ఇంక ఛార్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ కి ముందు ఛార్మి చేసిన హడావిడి మామూలుగా ఉండదు.

అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇంకా 14 రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న తరుణంలో టీం చాలా సైలెంట్ గా ఉండటం చాలా మందికి కొత్త అనుమానాలను రేకెత్తించేలా చేసింది. ఇకపోతే పూరి జగన్నాథ్ కి డిస్ట్రిబ్యూటర్స్ తో ఉన్న ఇష్యూస్ గురించి తెలిసిందే. ఒక టైంలో డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాథ్ ఇంటిముందు ధర్నా కూడా దిగే పరిస్థితి వచ్చింది. అయితే మరో వారం రోజుల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఇష్యూస్ ను క్లియర్ చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Liger

లైగర్ సినిమా నష్టాల గురించి వరంగల్ చౌదరి తో పూరి కనక్ట్స్ సీఈఓ విషు రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. ఛార్మీకి చెప్పి తెలంగాణ ఎగ్జిబిటర్లకు తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. అలా క్లియర్ చేసిన పక్షాన సినిమా రిలీజ్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అయితే పూరి సక్సెస్ ట్రాక్ ఎక్కేసినట్టే అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు