Double Ismart : ఈ మూవీని ఇంతకు ఎవరు రిలీజ్ చేస్తున్నారు..? పూరి మూవీకి ఇలాంటి పరిస్థితా…?

Double ismart: మామూలుగా ఒక సక్సెస్ కి ఫెయిల్యూర్ కి ఉండే తేడా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హిట్ సినిమా పడితే పది మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు పట్టుకుని ఆదర్శకుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదే ఒక ప్లాప్ సినిమా పడితే ఇచ్చిన అడ్వాన్సులు కూడా వెనక్కి తీసుకునే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అతి తక్కువ మంది మాత్రమే ఒక దర్శకుడు ఆలోచనను కథను నమ్మి కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి మంచి సూపర్ హిట్ కొట్టి అత్యధిక లాభాలను సంపాదిస్తారు. అది ప్రతి నిర్మాత యొక్క ఆశయం సంపాదించడం కాదు, ఒక గొప్ప సినిమాను నిర్మించాలని కూడా ఉంటుంది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకుడు మరియు నిర్మాతగా కూడా సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. అందులో పూరి జగన్నాథ్ ఒకరు. దర్శకుడుగా సక్సెస్ అయిన తర్వాత తన నిర్మాతగా కూడా వైష్ణో అకాడమీ అని ఒక బ్యానర్ స్టార్ట్ చేసి దానిపై సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పటికీ ఈ బ్యానర్ కి ఒక మంచి రిప్యుటేషన్ ఉంది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ అని
మరో బ్యానర్ కూడా స్టార్ట్ చేశాడు పూరి. దీనిపై కూడా మంచి సినిమాలను నిర్మించాడు.

Ram Pothineni

- Advertisement -

పూరి జగన్నాథ్ నమ్మి చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలు చేశారు. పూరి జగన్నాధ దర్శకత్వంలో పనిచేయడానికి ఒకప్పుడు హీరోలు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. లేకపోతే పూరి జగన్నాథ్ సినిమాలను కొన్నింటిని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్ లో పూరి చేస్తున్న సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. పూరి జగన్నాథ్ సినిమాలను రీసెంట్ టైమ్స్ లో వరంగల్ శీను అనే ఒక వ్యక్తి రిలీజ్ చేస్తూ ఉండేవాడు. అయితే ఆచార్య, లైగర్ సినిమాలు వరంగల్ శీనుకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అక్కడితో దాదాపు సైలెంట్ అయిపోయాడు.

ప్రస్తుతం డబ్బులు ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఎవరు రిలీజ్ చేస్తున్నారు అని ఒక క్యూరియాసిటీ చాలామందిలో మొదలైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గ్లోబల్ సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, ప్రైమ్ షో తరపున డైరెక్ట్ గా వీరమాచినేని వాసుదేవరావు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏదైనా దీని గురించి కొద్దిపాటి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక దిల్ రాజు విషయానికి వస్తే ఆకాష్ పూరి హీరోగా చేసిన మెహబూబా సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఆ సినిమా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు