DoubleIsmart : వద్దు బాబోయ్ అంటే మాట వినలేదు.. అంతా అలాగే ఉంచారు..ఇక కంట్రోల్ చేయలేరు..

Double Ismart :టాలీవుడ్ లో ఈ పంద్రాగస్టుకు రిలీజ్ అయిన క్రేజీ సినిమాలలో, భారీ అంచనాలతో విడుదలైన సినిమా “డబుల్ ఇస్మార్ట్”. పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఒక చెత్త సినిమా వచ్చిందని నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు పూరి జగన్నాథ్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ అనుకోలేదని చెప్పాలి. ఎలాగైనా హిట్ కొట్టాలని, పూరి జగన్నాథ్ మరీ ఇంతలా దిగజారాలా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే సినిమాకి ఇంత నెగిటివ్ రెస్పాన్స్ రావడానికి సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతకరమైన సీన్లు అని తెలిసిందే.

DoubleIsmart will be a huge disaster

వద్దంటే అలాగే ఉంచారు.. డ్యామేజ్ జరిగిపోయింది..

ఇక డబుల్ ఇస్మార్ట్ (DoubleIsmart) సినిమాలో పూరి వరస్ట్ డైరెక్షన్ తో పాటు, పలు పాత్రల క్యారెక్టరైజేషన్ చెత్తగా రాసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆలీ (Ali) పాత్ర చిత్రీకరణ అందరికి విసుగు పుట్టించిందని తెలిసిందే. కానీ పాత్ర పలికే డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్ వినేలా అస్సలు లేవు. సోషల్ మీడియాలో ఈ సీన్స్ ని డెలిట్ చేయమని ఎన్నో కామెంట్స్ వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ జనాల మాట వినకుండా అలాగే ఉంచారు. దాంతో కలెక్షన్లు మొత్తం పడిపోయాయి. ముఖ్యంగా పండగ సీజన్లో రావాల్సిన ఫ్యామిలీ ఆడియన్స్ అసలు ఈ సినిమాని పట్టించుకోలేదు. అలాగే అనుకోకుండా చూసిన వాళ్లయితే ఇలాంటి చెత్త సినిమా ఎక్కడా చూడలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.

- Advertisement -

చెత్త రికార్డ్ కి రెడీ…

అయితే డబుల్ ఇస్మార్ట్ తో పాటే రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ లో కూడా కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయని అంటే.. మేకర్స్ అప్పటికప్పుడు రెండో రోజు నుండే 13 నిముషాల సీన్లు సినిమాలో ట్రిమ్ చేసారు. కానీ డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ మాత్రం ఒక్క సీన్ కూడా తీయకుండా అలాగే ఉంచారు. ఫలితంగా భారీ డిజాస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు తెచ్చిన మీడియం రేంజ్ సినిమా లైగర్, కాగా ఆ తర్వాత రెండో స్థానంలో డబుల్ ఇస్మార్ట్ నిలిచే అవకాశం కనిపిస్తుంది. పైగా ఈ రెండు సినిమాలు కూడా పూరి జగన్నాథ్ వే కావడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు