Jawan Movie: ఎన్నో డౌట్స్, ఇంకెన్నో సస్సెన్స్… క్లారిటీ రేపే!

Jawan Movie

వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతూ, సినీ క్రిటిక్స్‌తో మాత్రమే కాదు, సాధారణ ఆడియన్ నుంచి కూడా విమర్శలు అందుకున్న బాలీవుడ్‌ను పఠాన్ మూవీతో అందరికీ సమాధానం చెప్పిన షారుక్ ఖాన్ నిజంగానే బాద్ షా అయిపోయాడు. కలెక్షన్ల కరువులో ఉన్న బీ టౌన్‌కు 1000 కోట్ల వసూళ్లు చేసి చూపించాడు. పఠాన్ తర్వాతే మళ్లీ బాలీవుడ్‌ మళ్లీ ఫాంలోకి వచ్చింది.

అలాంటి షారుక్ ఖాన్ నుంచి వస్తున్న మరో భారీ మూవీ జవాన్. తమిళ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచే అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. షారుక్ ఖాన్ మూవీ అంటేనే సినిమా ఇండస్ట్రీలో బజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాంటిది… షారుక్ ఖాన్, నయనతారతో పాటు విజయ్ సేతుపతి, దీపికా పదుకుణె కామియో పాత్రలో కనిపిస్తున్నారంటే, హైప్ ఇంకా పెరిగిపోయింది.

అయితే విజయ్ సేతుపతి, దీపికా పదుకుణె వంటి స్టార్లు జవాన్ సినిమాలో ఉన్నారని అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సినిమాలో ఇంకా ఎవరెవరు ఉన్నారో అనే క్లారిటీ మాత్రం లేదు. విజయ్ తలపతి, సంజయ్ దత్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయని టాక్ ఉంది. దీనికి ముందు ఈ మూవీలో నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కామియో చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. అయితే పుష్ప2 డేట్స్ వల్ల అల్లు అర్జున్ టైం కేటాయించకపోవడంతో విజయ్ తలపతితో అట్లీ కామియో రోల్ ప్లాన్ చేశాడని బీ టౌన్‌తో పాటు కోలీవుడ్ సినీ వర్గాలు కూడా కోడై కూశాయి.

- Advertisement -

ఒక పోలీస్ పాత్రను తమిళం, తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల వర్షెన్‌లో విజయ్ సేతుపతి కనిపిస్తాడని, హిందీ వర్షెన్‌లో సంజయ్ దత్ కామియోగా కనిపిస్తాడని టాక్ ఉంది. దీంతో పాటు జవాన్ సినిమాలో చాలా సస్పెన్స్ ఉన్నాయి. ట్రైలర్‌లో షారుక్ ఐదు విభిన్నమైన లుక్స్‌లో కనిపించాడు. దీనిపై ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు.

ఇలా తెలుసుకోవాల్సినవి అన్నింటికి రేపు తెరపడనుంది. సెప్టెంబర్ 7న జవాన్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే జవాన్ (Jawan) మూవీకి బుక్ మై షోలో 7 లక్షల ఇంట్రెస్ట్‌లు రాగా, గంటకి కనీసం 30 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి.

Check out Filmify for the latest Celebrities gossips, today’s Hollywood news, the latest images of actors & actresses, new movie updates, and ratings & reviews, and the latest entertainment news from all Film Industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు