Drishyam : దృశ్యం సినిమాకు అరుదైన గౌరవం..!!

హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో.. ఇప్పటికే చాలా సినిమాలు ఇండియాలో రీమేక్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి.. అయితే ఇప్పుడు భారతీయ సినిమాలను కూడా నేరుగా హాలీవుడ్ లో రీమేక్ చేసిన దాఖలు అయితే లేవు.. కానీ ఇప్పుడు ఇండియన్ ఫిలింను ఏకంగా హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.. అది కూడా ఒక సౌత్ సినిమా అంటే మామూలు విషయం కాదు.. ఈ విషయం తెలిసి ఇండియన్ సెలబ్రిటీలతో పాటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఆ సినిమా ఏదో కాదు దృశ్యం.. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రీమిక్స్ చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది..

హాలీవుడ్ లో రీమేక్ కానున్న దృశ్యం మూవీ:
ప్రస్తుతం దృశ్యం సినిమాని హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం.. అంతేకాదు ఈ చిత్రం రీమేక్ కోసం బడా నిర్మాణ సంస్థలు కూడా చేతులు కలిపినట్లు తెలుస్తోంది. దృశ్యం సినిమా ఇప్పటికే ఎన్నో భారతీయ భాషలలో రీమేక్ అయ్యి మంచి విజయాలను అందుకుంది. తెలుగు , మలయాళం ,హిందీ , కన్నడ, తమిళ్ ఇతర భాషలలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ గానే నిలిచింది..ఇకపోతే తెలుగులో వెంకటేష్ హీరోగా నటించగా.. ఈ సినిమాకి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఆ తర్వాత దృశ్యం-2 సినిమా కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. మరి ఇప్పుడు హాలీవుడ్లో ఈ చిత్రంలో ఎవరు నటిస్తారనే విషయం తెలియాల్సి ఉంది..

దృశ్యం రీమేక్ భాషల విషయానికి వస్తే:
ఒరిజినల్ గా ఈ సినిమా మలయాళం సినిమా అయినప్పటికీ అందులో మోహన్ లాల్ ,మీనా జంటగా నటించారు.. దృశ్యం చిత్రం 2013లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాతే తెలుగులో రీమేక్ చేశారు. అలాగే హిందీలో కూడా రీమేక్ చేయగా.. అందులో అజయ్ దేవగన్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.. 2015లో తమిళంలో పాపనాశం అనే టైటిల్ తో కమలహాసన్ హీరోగా నటించారు.. 2017లో సింహళ భాషలో మరియు 2019లో చైనీస్ భాషలో కూడా రీమేక్ చేశారు.. 2021 లో ఇండోనేషియా అలాగే 2023లో కొరియన్ భాషలలో రీమేక్ చేశారట.ఇప్పుడు దృశ్యం సినిమా ఏకంగా హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు..

- Advertisement -

దృశ్యం మూవీని రీమేక్ చేయనున్న హాలీవుడ్ నిర్మాణ సంస్థలు:
ఈ సినిమా హక్కులను పనోరమ స్టూడియోస్ కొనుగోలు చేసింది.. ఆ సంస్ధ ఇప్పుడు దృశ్యం చిత్రాన్ని గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్ బ్యానర్ పైన హాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.. ఈ విధంగా దృశ్యం సినిమా తొలి భారతీయ రీమిక్స్ సినిమాగా హాలీవుడ్లో పేరు సంపాదించుకుంది.. హాలీవుడ్ లో ఈ సినిమా విడుదలైన తర్వాత మరో 3 నుంచి 5 ఏళ్లలోపు పది భాషలలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు ఆ నిర్మాణ సంస్థ తెలియజేసినట్లు తెలుస్తోంది.. ఏది ఏమైనా దృశ్యం సినిమా విడుదలై అన్ని భాషలలో భారీ విజయాన్ని అందుకుంది.. మరి హాలీవుడ్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు