Dulquer Salman : దుల్కర్ తెలుగు మూవీ ఫిక్స్.. ఆ రోజే అనౌన్స్మెంట్..!

Dulquer Salman.. మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. సీతారామం సినిమాను నేరుగా తెలుగులో చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు అవార్డులను సైతం దక్కించుకున్నారు.. హీరోగా తెలుగులో చేసిన ఈయన.. ఇప్పుడు మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా దుల్కర్ సల్మాన్ కు ఏ రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు.. మలయాళం హీరో అయినప్పటికీ..తెలుగు హీరోగా తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.. దీంతో ఈయన నుంచి నేరుగా మరో తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూడగా ఇప్పుడు పవన్ సాదినేని దర్శకత్వంలో మరో తెలుగు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు దుల్కర్ సల్మాన్.ఇదిలా ఉండగా సీతారామం సినిమాను నిర్మించిన వైజయంతి మూవీస్ వారు ఇప్పుడు ఈ సినిమాని కూడా నిర్మించనున్నట్లు సమాచారం.

Dulquer Salman : Dulquer Telugu movie fix.. announcement on that day..!
Dulquer Salman : Dulquer Telugu movie fix.. announcement on that day..!

వైజయంతి బ్యానర్ లో దుల్కర్ మరో మూవీ..

ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ , పవన్ సాదినేని దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై మరో తెలుగు చిత్రాన్ని చేయబోతున్నారు.. ఇక జూలై 28వ తేదీన దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను ఆరోజు అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అంతేకాదు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తూ ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పవన్ సాదినేని సినిమాలు..

పవన్ సాదినేని విషయానికి వస్తే.. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి , సేనాపతి వంటి సినిమాకు దర్శకత్వం వహించారు.. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన సేనాపతి ఇటీవలే ఓటీటీలోకి వచ్చి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.. అంతేకాదు ఒక నాలుగు వెబ్ సిరీస్ లకి దర్శకత్వం కూడా వహించారు.. అందులో దయా వెబ్ సిరీస్ చాలా సక్సెస్ అయ్యింది. పవన్ కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టడమే కాదు.. ఇందులో నటించిన పలువురు నటీనటులకు కూడా అంతకుమించి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఇక ఇటీవల వచ్చిన పరువు వెబ్ సిరీస్ కి కూడా షో రన్నర్ గా పవన్ సాదినేని వ్యవహరించారు.

- Advertisement -

దుల్కర్ పుట్టిన రోజు నాడే అనౌన్స్మెంట్..

ఇకపోతే వరుస సినిమాలతో వెబ్ సిరీస్ లతో మంచి విజయాన్ని అందుకున్న పవన్ సాదినేని దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణ సారధ్యంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న మూవీకి అనౌన్స్మెంట్ కు ముహూర్తం ఖరారు అయింది..దుల్కర్ పుట్టినరోజు అయిన జూలై 28వ తేదీన ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడనుంది…

దుల్కర్ సల్మాన్ సినిమాలు..

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమానే చేస్తున్నారు.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఈ సినిమాలో బ్యాంకు ఉద్యోగిగా దుల్కర్ నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఫార్చ్యూన్ ఫోర్ , సితార ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నాగ వంశీ , సాయి సౌజన్య నిర్మిస్తూ ఉండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు