Dussehra Fight : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతి పెరిగింది. స్థాయి పెరిగింది. ఇక్కడ వచ్చే సినిమాలు ఒక తెలుగులోనే కాదు.. సౌత్ లోనే కాదు.. పాన్ ఇండియా రేంజ్ లో చూస్తున్నారు. ఆదిరిస్తున్నారు. బాహుబలితో మొదలై.. పుష్ప, ఆర్ఆర్ఆర్ తో పాటు ఇటీవల వచ్చిన సీతారామం, కార్తికేయ2 వరకు సౌత్ ఆడియన్స్ ను మాత్రమే కాదు.. హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులను కూడా ఆలరించాయి. దీంతో టాలీవుడ్ లో వచ్చే ప్రతి సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నుండి యంగ్ హీరోల వరకు పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పై గురి పెడుతున్నారు. ఈ దసరాకు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాద్ సినిమా విడుదలైవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉండటంతో బాలీవుడ్ లో కూడా విడుదల చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. గాడ్ ఫాదర్ టీం రేపు ముంబై లో ప్రీ రిలీజ్ మీడియా మీట్ ను కూడా నిర్వహించబోతుంది. దీంతో పాటు దసరా బరిలో ఉన్న ది ఘోస్ట్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది.

హిందీలో రిలీజ్ చేయడానికి కింగ్ నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. హిందీ వర్షెన్ గురించి ఇప్పటికే పనులు కూడా జరుగుతున్నాయట. అలాగే హిందీ రైట్స్ గురించి కూడా చర్చలు జరుగుతున్నట్టు టాక్. అన్ని కుదిరితే ఈ నెల 7న హిందీ వర్షెన్ ను కూడా విడుదల కానుంది. దీంతో ఈ సారి టాలీవుడ్ హీరోలు దసరా పోటీ ఒక్క తెలుగులోనే కాదు.. బాలీవుడ్ లోనూ ఉండబోతుంది. మరి చివరికి ఈ అగ్ర హీరోల్లో ఎవరు నిలుస్తారో.. ఎవరు గెలుస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు