T.G.Viswaprasad: దుష్ప్రచారం చేస్తున్న వారికి ఇదే నా సమాధానం – ఈగల్ నిర్మాత..!

T.G.Viswaprasad

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. ముఖ్యంగా టీ.జీ. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఇద్దరూ కూడా ఈ సంస్థను మొదలుపెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందించారు. తాజాగా ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈగల్ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోగా రవితేజ, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత టీ.జీ. విశ్వప్రసాద్ ప్రొడక్షన్ హౌస్ లో జరిగే అవినీతి గురించి మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ముఖ్యంగా ప్రొడక్షన్ హౌస్ లో జరిగేటువంటి అవినీతి చర్యల వల్ల సినిమా క్వాలిటీ కూడా చాలా దెబ్బతింటుందని.. దాన్ని అరికట్టడానికే తాను ఎలాంటి చర్యలు తీసుకున్నాననే విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చారు.. అయితే తన మాటలను చాలా మంది ఇండస్ట్రీలో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. అందుకు సంబంధించి మళ్లీ ఒక ట్వీట్ కూడా ఇటీవలే విడుదల చేశారు.. ఈగల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక విలేకర్ అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలను తెలిపారు.

టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. తన ప్రొడక్షన్ హౌస్ లో జరిగిన అవినీతి చర్యల వల్ల సినిమాల క్వాలిటీ దెబ్బతింటుందని తెలిపారు.. ఆ అవినీతిని అరికట్టే ప్రయత్నంలో తను ఎలాంటి ప్రతి చర్యలు చేపట్టానో మీడియాకు చెప్పడం జరిగింది.. ఈ విషయం విన్న చాలామంది భుజాలను తడుముకున్నారు. కొందరు పరిశ్రమ వ్యక్తులు తన వ్యాఖ్యలను తప్పు అంటూ వక్రీకరించారని తెలిపారు.. తాను కూడా కార్మిక సంఘాల సభ్యులను, శ్రామికులను కించపరిచినట్లుగా దుష్ప్రచారం చేశారని తెలిపారు.

- Advertisement -

అయితే ఇండస్ట్రీలో కొందరు వ్యక్తులు అవినీతి వల్ల కష్టపడి పని చేసే కొంతమంది కార్మికులకు తన డబ్బు అందడం లేదని తాను అన్నారని.. అది కూడా తన కంపెనీ అంతర్గత వ్యవహారం గురించి తాను వ్యాఖ్యలు చేసినప్పటికీ బయట వారికి ఎలాంటి సంబంధం లేదని.. అయినప్పటికీ వారు తల దూర్చారని తెలిపారు.. తన సంస్థలో ఎవరికైనా జీతాలు అందకపోతే కచ్చితంగా నేరుగానే మాట్లాడి తనతోనే తీసుకుంటారని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

ఒకవేళ ఏదైనా యూనియన్ కి కంప్లైంట్ వస్తే కచ్చితంగా ఛాంబర్లో లేదా కౌన్సిల్లో సాల్వ్ చేసుకుంటామని.. ఇండస్ట్రీలోకి ఇష్టపడే వచ్చామని.. అలా వచ్చే వ్యాపారం లోకి అడుగుపెట్టాము ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం తమకు లేదు అంటూ తెలిపారు.. తమ కంపెనీలో అవినీతికి పాల్పడని వారంతా కూడా చాలా గర్వంగా పని చేయవచ్చు అంటూ తెలిపారు.. ఇలాంటి వారి పైన తాను ఎలాంటి లీగల్ యాక్షన్ కూడా తీసుకోమని.. అవినీతిపరులపై కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.. వారి యొక్క కుటుంబాల గురించి ఆలోచించే వారిని వదిలేశాను అంటూ తెలిపారు టీజీ విశ్వప్రసాద్. తమ బ్యానర్ పైన 30 సినిమాలకు పైగా తీశాము.మూడు లక్షల మంది కార్మికుల సోదరుల కష్టం ఉంది.. మరో పాతిక సినిమాలు తమ బ్యానర్ పైనే వస్తున్నాయని తెలియజేశారు. యూనియన్ వర్కర్స్ కి ఎప్పుడు వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు టీజీ విశ్వప్రసాద్.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు