Raviteja Heroine : అప్పుడేమో రవితేజతో రొమాన్స్.. ఇప్పుడేమో ఇలా చేసింది..

Raviteja Heroine : ఒకప్పుడు రవితేజతో సరసన నటించిన హీరోయిన్లు ఇప్పటికి ఇండస్ట్రీలో రానిస్తున్నారు. అందులో కొందరు హీరోయిన్లుగా రాణిస్తే మరికొందరు మాత్రమే సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఒకప్పుడు రవితేజతో రొమాన్స్ చేసిన హీరోయిన్ ఇప్పుడు ఆయన సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఆమె ఎవరో ఎందులో నటించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా రీసెంట్ గా విడుదలై మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. సినిమాకి మౌత్ టాక్ బాగానే వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో వచ్చే ఇన్కమ్ టాక్స్ రైడ్ ఎపిసోడ్స్ మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా కొన్ని వర్గాల ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. గతంలో జగపతి బాబు హీరోగా తెరకెక్కిన ‘సముద్రం’,‘బడ్జెట్ పద్మనాభం’ వంటి సినిమాల్లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. అలాంటిది ఇప్పుడు రవితేజ సినిమాలో జగ్గూ భాయ్ విలన్ గా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో జగపతి బాబుకు భార్య ప్రభావతి పాత్రలో ఇందులో మణిచందన నటించింది.

Earlier Ravi Teja acted in the movie Manichandana Manasichchanu
Earlier Ravi Teja acted in the movie Manichandana Manasichchanu

ఈమె గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. గతంలో ‘రవితేజకి మణిచందన హీరోయిన్ గా నటించింది’ అని ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ ఇది అక్షరాల నిజం అన్నమాట. 2000 సంవత్సరంలో రవితేజ హీరోగా ‘మనసిచ్చాను’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో రవితేజకు జోడిగా నటించింది. మణిచందన హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం. ఆ తర్వాత కూడా ఈమె ‘ఎన్టీఆర్ నగర్’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈమె తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు