RamojiRao Hospitalised : రామోజీరావు కు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ పై చికిత్స..

RamojiRao Hospitalised: తెలుగు మీడియా లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుపొందిన ఈనాడు సంస్థల చైర్మన్‌ “రామోజీ రావు” అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం నుండి ఆయన నీరసంగానే ఉండగా, కొద్దిసేపటికింద రామోజీరావు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని రామోజీ రావు ఇంటి నుండి నానక్ రామ్ గూడ లో ఓ ఆస్పత్రి కి తరలించారు. తాజాగా కొద్దిసేపటికిందే ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం. ఇక ఈ వార్త తెలుగు మీడియా రంగంలో కలకలం రేపింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మీడియాతోపాటు రాజకీయ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. 87 ఏళ్ల రామోజీ రావు పలు అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం బాధపడుతున్నారు. గతంలో కూడా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక అస్వస్థతకు (RamojiRao Hospitalised) గురయిన రామోజీరావును నానక్ రామ్ గూడలోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ఆయనకు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Eenadu Chairman RamojiRao Hospitalised

వెంటిలేటర్ పై చికిత్స.. 24 గంటల తర్వాతే చెప్పగలరట..

ఇక రామోజీ రావుని కాసేపటికిందే హాస్పిటల్ లో జాయిన్ చేయగా, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో రామోజీ రావుకి వైద్య సేవలు అందుతున్నాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇప్పటివరకు వైద్యులు వెల్లడించలేదు. 24 గంటలు గడిస్తేనే అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం ఉంది. కాగా రామోజీ రావు మీడియాతోపాటు అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనాడు సంస్థలు, రామోజీ ఫిల్మ్‌ సిటీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌, ప్రియా ఫుడ్స్‌ వంటి పలు రకాల వ్యాపారాల్ని రామోజీ రావు ఒంటిచేత్తో నడిపిస్తున్నాడు. ఇక తెలుగు మీడియాలో మూడున్నర దశాబ్దాలుగా, ప్రధానమైన ఈనాడు సంస్థ ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

రాజకీయాల్లో కీలక పాత్ర..

ఇక తెలుగు రాజకీయాల్లో రామోజీరావు (RamojiRao Hospitalised) కీలక పాత్ర వహిస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల్లో ఈనాడు ప్రధాన భూమిక పోషించింది. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ పరోక్షంగా త్వరలో కొలువుదీరనున్న కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ఇక కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రామోజీ రావుకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. ఆనాడు ఎన్టీఆర్ టిడిపి పెట్టినప్పటినుండి రామోజీ రావు నందమూరి ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాడు. పాలిటిక్స్ లో డైరెక్ట్ గా దిగకుండా తన పత్రికలతో, ఈటీవి ఛానెల్ తో మంచి ప్రచారం చేసి చంద్రబాబు గెలుపుకి కారణమయ్యారు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ నేరుగా ఈనాడు పేరు ప్రస్తావిస్తూ రామోజీ రావుపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక రామోజీ రావుకు ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్నా, తాజాగా శుక్రవారం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక రామోజీ రావు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు బులిటెన్ ని అందిస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్యం గురించి ఓ క్లారిటీ రావాలంటే రేపటివరకీ ఆగాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు