Eesha Rebba : అరవింద సమేత మూవీలో అన్యాయం జరిగింది… ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్

Eesha Rebba: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోయిన్స్ లో ఈషా రెబ్బ ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈషా రెబ్బ. ఈ సినిమాలు హరిణి అనే పాత్రలో కనిపించింది. అయితే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చేసిన బందిపోటు అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది.

Eesha Rebba: That alone gives me satisfaction
Eesha Rebba: That alone gives me satisfaction

అయితే ఆ తర్వాత ఓయ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్లీ తెలుగులో అమీ తుమీ సినిమాలో నటించింది. ఈ సినిమాకి కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. తర్వాత దర్శకుడు బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో కనిపించింది. ఈ సినిమాలు అంతంత మాత్రమే ఆడాయి. వరుస సినిమాలు చేస్తున్న కూడా ఈషా రెబ్బకు సరేనా బ్రేక్ రాలేదు అని చెప్పాలి.

అరవింద సమేత సినిమాలో నా సీన్స్ కట్ చేశారు

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కనిపించింది ఇషా. ఈ సినిమాలో పూజా హెగ్డే సిస్టర్ గా నటించింది. అయితే ఈ సినిమా గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇషా. ఈ సినిమాలో తనది కూడా ఒక మెయిన్ లీడ్ అని చెప్పారని చెప్పుకొచ్చింది. ఈ సినిమాతో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అని చెప్పారు. అని ఈ సినిమాలో నాతో చాలా సీన్స్ ని షూట్ చేశారని, ఆ సీన్స్ అన్నీ కూడా ఎడిటింగ్ లో పోయాయని చెప్పింది ఇషా. అయితే ఈ సినిమాకి సంబంధించి నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఏమైనా ఉంది అంటే, అది ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం, త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో చేయటం అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఒక సరైన హిట్ సినిమా పడాలి

ఏది ఏమైనా కూడా సినిమాలో ఏ సీన్స్ ఉండాలి ఏ సీన్స్ తీసేయాలి అని చివరి నిర్ణయం అనేది దర్శకుడుది. సినిమా మొత్తంలో కూడా ఇషా సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలానే ఈసా సీన్స్ ని కట్ చేయడం వల్ల సినిమాకు వచ్చిన ఇబ్బంది కూడా పెద్దగా లేదు అని చెప్పొచ్చు. ఇకపోతే అరవింద సమేత తర్వాత చాలా సినిమాలు చేసింది ఇషా. అలానే అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా కనిపించింది. చివరగా ఈసా చేసిన సినిమా మామ మచ్చింద్ర. అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఏదేమైనా ఈ తెలుగు హీరోయిన్ మంచి అవకాశాన్ని అందుకొని నిలద్రొక్కుకుంటే చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు