Ester Noronha: అవకాశాల కోసం ఆడవాళ్లే ఆఫర్.. ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్..!

Ester Noronha.. తెలుగు ప్రేక్షకులకు బోల్డ్ బ్యూటీగా పేరు పొందింది ఎస్తేర్ నోరాన్హ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈమెను చూస్తే కచ్చితంగా ఇట్టే గుర్తు పట్టేస్తారు. గతంలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. 1000 అబద్దాలు అనే సినిమాతో మొదటిసారిగా హీరోయిన్ గా తెలుగు తెరకు సుపరిచితురాలు అయ్యింది. కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది.. చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. ఎక్కువగా బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ఉంటుంది ఎస్తేర్.

వివాహం తర్వాత హద్దులు మీరి..

Ester Noronha: Women offer opportunities.. Esther's shocking comments..!
Ester Noronha: Women offer opportunities.. Esther’s shocking comments..!

అయితే హీరోయిన్ గా అవకాశాలు తక్కువగా వచ్చినప్పటికీ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉంటుంది.. గతంలో సింగర్ నోయల్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకొని నెలరోజుల లోపే విడిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఎస్తేర్ సింగిల్ గానే తన జీవితాన్ని గడిపేస్తోంది. నోయల్ తో విడిపోయిన తర్వాత ఎస్తేర్ హద్దులు దాటి మరీ అందాల ఆరబోత చేస్తూనే రొమాంటిక్ సన్నివేశాలలో నటించేందుకు సిద్ధమయ్యింది. అలా 69 సంస్కార్ కాలనీలో రెక్కి అనే సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలతో రెచ్చిపోయింది. ఈమె అందాన్ని చూసి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారని చెప్పవచ్చు.

రెండో పెళ్ళికి సిద్ధం..

ఎస్తేర్ హీరోయిన్ గా చేస్తూనే మరొకవైపు నిర్మాతగా, దర్శకురాలిగా మారినట్లు తెలుస్తోంది.. ఈమె ప్రస్తుతం ది వేకెంట్ హౌస్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నది.. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తోంది. అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది ఎస్తేర్.. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన రెండవ పెళ్లి విషయం పైన యాంకర్ ప్రశ్నించగా.. అందుకు ఎస్తేర్ ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటానని తెలిపింది.. తనకి కూడా ఒంటరిగా ఉండాలని లేదని కూడా క్లారిటీగా చెప్పేసింది. అలాగే ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ పైన మాట్లాడుతూ..

- Advertisement -

ఆడవాళ్లు కూడా ఆఫర్ చేస్తున్నారు..

ఇండస్ట్రీలో మగవాళ్లు అడగడం మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఇండస్ట్రీలో ఆఫర్లు చేస్తూ ఉన్నారని బాంబు పేల్చింది.. అయితే అవకాశాల కోసం క్యారెక్టర్ ను మార్చుకోనని.. అందుకే తాను చాలా సినిమాలు మిస్ అయిపోయాయని వెల్లడించింది ఎస్తేర్.తను మోడల్ దుస్తులు వేసుకుంటే.. చాలామంది చాలాసార్లు ట్రోల్ చేశారని.. దీంతో తనని వేశ్య అని ముద్ర కూడా వేస్తూ ఉంటారని ఎమోషనల్ గా మాట్లాడింది ఎస్తేర్. ఆడవాళ్లకు కూడా కోరికలు ఉంటాయి.. వాటిని నెరవేర్చుకునే సమయంలో పెద్ద నేరంలా ఈ సమాజం చూస్తుంది అంటూ తెలిపింది ఎస్తేర్. ప్రతి మహిళకు కూడా ఒక జీవితం ఉంటుంది.. వారికి కూడా ఎమోషన్స్ ఉంటాయి అంటూ వెల్లడించింది. ప్రస్తుతం ఎస్తేర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు