Telugu Industry : ఇండస్ట్రీలో విషాదం.. లేడీ ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య

Telugu Industry : ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎన్నో విషాదాలు చూస్తూ వస్తున్నాం. చాలామంది సక్సెస్ఫుల్ అయిన పీపుల్ కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇకపోతే కొంతమంది ఆత్మహత్య చేసుకునేటప్పుడు మిగతా వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అలా చేసుకున్నారు అసలు పోయి సాధించేదేముంది. ఏదైనా ఉంటే బతికి సాధించాలి అంటూ చెబుతూ ఉంటారు కానీ చాలామంది సినీ పరిశ్రమలో ఏదో ఒకటి సాధించి వెళ్లిపోయిన కూడా ఉన్నారు. అయితే వాళ్లకి వ్యక్తిగత కారణాలు ఉంటాయి. ఏదేమైనా కూడా అలా చేయడం సరైన పద్ధతి కాదు అని ఎంతో మంది చెబుతూ వస్తున్న ఈ ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు.

ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్ వంటి ఎంతోమంది సక్సెస్ఫుల్ హీరోలు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తమకంటూ కొంత పేరును సాధించుకొని ఆ తర్వాత పాల్గొన్న వ్యక్తిగత కారణాలవల్ల చనిపోయారు. అలానే రంగనాథ్ వంటి సినీ నటుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తాజాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో స్వప్న వర్మ(33) ఆత్మహత్య చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్న స్వప్న సొంతూరు రాజమండ్రి.మూడేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి, కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ 101లో ఒంటరిగా ఉంటున్న స్వప్న. రెండు రోజుల క్రితం తన ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరివేసుకున్న స్వప్న. వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు చుట్టుపక్కల వాళ్లు. దీనితో ఆమె ప్లాట్ యొక్క తలుపులు బద్దలు కొట్టి చూడగా ఈ ఈ విషయం బయటపడింది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు