Fahid Fazil: పుష్ప 2 కోసం ఏకంగా అన్ని రోజులు కేటాయించిన ఫాహిద్ ఫాజిల్..!

Fahid Fazil: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న పుష్ప 2 పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై ఇటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు మరోపక్క నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో ఫాహిద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో ఫాహిద్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Fahid Fazil has dedicated all his days for Pushpa 2
Fahid Fazil has dedicated all his days for Pushpa 2

ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ కోసం రెండు వారాలపాటు డేట్స్ను కేటాయించినట్లు తెలుస్తుంది. తన పార్ట్ షూటింగ్ ముగిసిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్, ఫాహిద్ లను మరోసారి వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 15.. 2024న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు