The Goat: ధోనినే చంపాలని చూస్తారా… మరీ దారుణం రా ఇది..

The Goat: తమిళ స్టార్ విజయ్ దళపతి ( Vijay Thalapathy ) లియో సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా తర్వాత విజయ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్ ‘ (The Goat).. ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకుందని తెలుస్తుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత అంత క్రేజ్ ను అందుకోలేదు. కొన్ని డైలాగులు బాగానే పేలాయి. కానీ ఓవరాల్ గా మూవీ పెద్దగా ఆకట్టుకోలేదని టాక్ నడుస్తుంది. అయితే ఈ మూవీలో ఒక సీన్ మాత్రం క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. ఆ డైలాగ్ పై ఇప్పుడు మీమ్స్ బాగానే పేలుతున్నాయి.

విజయ్ గోట్ మూవీ హైలెట్స్..

హీరో విజయ్ నుంచి వచ్చిన తాజా మూవీ గోట్.. భారీ బడ్జెట్ తో పాటుగా భారీ అంచనాలతో ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందు భారీ హైప్ ను క్రియేట్ చేసిన ఈ మూవీకి రిలీజ్ అయ్యాక ఆ రేంజ్ టాక్ ను అందుకోలేదని టాక్. ఫస్ట్ హాఫ్ బాగానే ఆకట్టుకున్న గోట్ మూవీ.. సెకండ్ ఆఫ్ మాత్రం కాస్త బోరింగ్ గా అనిపించిందనే టాక్ ను అందుకుంది. కొన్ని సీన్స్ ల్యాగ్ అయ్యాయని పబ్లిక్ చెబుతున్నారు. విజయ్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే మ్యూజిక్, సాంగ్స్ ఓ రేంజులో ఉన్నాయి. యువన్ శంకర్ (Yuvan Sankar ) మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని విజయ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.. ఇకపోతే అనవసరపు సీన్లు ఎక్కువగా ఉండటం వల్లే యావరేజ్ టాక్ ను అందుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ధోనినే చంపాలని చూస్తారా…

Fans fire on the scene to kill Dhoni in the movie Vijay Goat
Fans fire on the scene to kill Dhoni in the movie Vijay Goat

గోట్ సినిమాలో ఓ స్టార్ క్రికెటర్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా నచ్చేలా ఉందని సమాచారం. గోట్ సినిమాలో మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) రిఫరెన్స్ ఓ సీన్ లో పేలిపోయేలా ఉందట. ఆ సీన్ కి థియేటర్లో మంచి స్పందన వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ధోనిని మళ్లీ క్రియేట్ చెయ్యడం ఫ్యాన్స్ కు బాగా నచ్చేసింది. ఈ సీన్ ఎమ్మెస్ ధోనికి మంచి గూస్బంప్స్ ఫీలింగ్ ఇస్తుందని టాక్. అయితే ఓ సీన్ లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో బాంబ్ పెట్టడం, అలాగే ధోని రూమ్ లో కూడా బాంబ్ పెట్టి చంపాలని కొందరు ప్లాన్ చేస్తారు. అది తెలుసుకున్న హీరో బాంబ్ లను తీసేస్తాడు. సినిమా కోసం ధోనిని చంపాలని అనుకుంటారా అని ఫ్యాన్స్ గోట్ మూవీ పై మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సీన్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ కూడా హైలెట్ అవుతున్నాయి. దీనిపై టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు