Jr Ntr : తారక్ ని చూసైనా చరణ్ నేర్చుకోవాలని అంటున్న నెటిజన్లు..

Jr Ntr : టాలీవుడ్ లో ఈ తరం స్టార్ హీరోల్లో బద్ధకం ఎక్కువైపోతుందని నెటిజన్లు అంటున్నమాట. ముఖ్యంగా టాలీవుడ్ ని రూల్ చేస్తున్న ఆరుగురు హీరోల్లో గత కొంత కాలంగా చాలా నెమ్మదిగా సినిమాలు వస్తున్నాయి. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాల హడావిడి పెరిగిందో, అప్పటి నుండి స్టార్ హీరోలు ఎలాంటి సినిమాలు చేసినా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. రీజనల్ కథని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేయడానికి ఆరాటపడుతున్నారు. అయితే స్టార్ హీరోలలో ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాటజీ ఉంది. వాళ్లలో కొందరు సినిమాలు లేట్ చేయడనికి కారణాలు కూడా వేరే ఉన్నాయి.

Fans say to watch Jr Ntr speed and learn from Ram Charan

లేట్ గా సినిమాలు చేస్తున్న స్టార్స్…

అయితే టాలీవుడ్ ని రూల్ చేసే స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ మొన్నటివరకూ వరుస సినిమాలతో బిజీగా ఉండగా, రాజకీయాల వల్ల సినిమాలకి గ్యాప్ ఇచ్చాడు. అయితే త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతానన్నాడు. ఇక మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి సినిమాకి ఫిక్స్ అయిపోగా, జక్కన్నతో సినిమా అంటే ఎంత టైం పడుతుందో తెలిసిందే. అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినా పుష్ప ది రూల్ తర్వాతే ఒకే చేసే పనిలో ఉన్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి 2 తర్వాత చాలా లేట్ గా సినిమాలు చేసేవాడు. కానీ సాహో తర్వాత ఇక, ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేయనని, ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పాడు. అనుకున్నట్టు గానే లాస్ట్ రెండేళ్లలో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ చేసి షాకిచ్చాడు.

- Advertisement -

తారక్ ని చూసి నేర్చుకోమంటున్న ఫ్యాన్స్…

అయితే వీరు కాకుండా కాస్త నెమ్మదిగా సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరంటే.. అది తారక్, రామ్ చరణ్ అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ RRR తర్వాత ఫుల్ ఫోకస్ దేవరపై పెట్టేయగా, ఆ సినిమా ఫినిష్ కాకముందే బాలీవుడ్ లో వార్2 మొదలు పెట్టాడు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ సినిమా కూడా మొదలు పెట్టేసాడు. వీటి తర్వాత దేవర పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇలా ఆలస్యమైనా సెట్స్ పై ఒకేసారి మూడు సినిమాలు తీసుకొచ్చాడు. కానీ రామ్ చరణ్ మాత్రం RRR తర్వాత గేమ్ ఛేంజర్ కే మూడేళ్లు కేటాయించగా, ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ కాకపోగా, షూట్ చేస్తూనే ఉన్నారు. ఇక బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరుపుకున్నాక ఒక్క షెడ్యూల్ కూడా జరగలేదు. ఇక సుకుమార్ సినిమా కూడా చేయాల్సి ఉంది కానీ, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలీదు. కానీ రామ్ చరణ్ మాత్రం సెట్స్ లో ఉండకుండా వెకేషన్లకు వెళ్తుండడం పట్ల ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క తన తోటిహీరో అయిన తారక్ దూసుకుపోతుంటే, చరణ్ మాత్రం ఇంత నెమ్మది కావడం పట్ల నెటిజన్లు తారక్ ని చూసైనా నేర్చుకో చెర్రీ. ఇప్పుడైనా సినిమాల స్పీడ్ ని పెంచు అని కౌంటర్ వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు