Kannappa : ఆ కన్నప్ప కి ఈ కన్నప్ప కి పొంతన లేకుండా చేసారుగా? ఈ మాత్రం దానికి?

Kannappa : మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “కన్నప్ప” కోసం తెలుగు సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మహా భారత్ సీరియల్ డైరెక్టర్లలో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా రేంజ్ స్టార్ కాస్ట్ నటిస్తుండడంతో ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మొదట ఈ సినిమా స్టార్ట్ అయినా కూడా పెద్దగా అంచనాలు లేవుకాని.. ఎప్పుడైతే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథలో ఎంటర్ అయ్యాడో అప్పటినుండి ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. ఇక కొన్ని రోజుల కింద కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా టీజర్ ని ప్రమోట్ చేయగా, తాజాగా ఈరోజు (జూన్ 14) “కన్నప్ప” (Kannappa) అఫిషియల్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. కాసేపటికిందే రిలీజ్ అయిన ఈ టీజర్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.

Fans trolling Manchu Vishnu Kannappa teaser

‘తిన్నడు’ గా కన్నప్ప…

ఇక ‘కన్నప్ప’ టీజర్ కాసేపటికిందే రిలీజ్ కాగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇక టీజర్ లో మంచు విష్ణు పైనే ప్రధానంగా ఫోకస్ చేసారని తెలుస్తుంది. టీజర్ లో మంచి విష్ణు ని కన్నప్ప గా మారక ముందు నాయకుడు కాబోయే ‘తిన్నడు’ గా ఇంట్రడ్యూస్ చేసారు. టీజర్ లో 50 మంది హీరో ఒక్కడే తన బాణంతో మట్టికరిపించిన హై యాక్షన్ సీక్వెన్సెస్ టీజర్ లో చూపించారు. బహుశా సినిమాలో అదే ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు. ఇక టీజర్ లో మంచు విష్ణు సరికొత్తగా కనిపిస్తున్నాడు. అలాగే టీజర్ చూస్తుంటే సినిమాని చాలా రిచ్ గా హై టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ఇక టీజర్ లో ప్రేక్షకుల కళ్ళు ప్రభాస్ నే వెతకగా, టీజర్ చివర్లో ప్రభాస్ యొక్క కళ్ళను మాత్రం రివీల్ చేశారు. అలాగే టీజర్ లో అక్షయ్ కుమార్ ని శివుడిగా చూపిస్తున్నట్టు తెలిసిపోతుంది. ఇక సినిమాలో ఉండే భారీ తారాగణం అంతా టీజర్ లో చిన్న చిన్న సెకెన్ల షాట్స్ తో చూపించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్ సహా, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రీతీ ముకుందన్, ముకేశ్ రిషి ఇలా అందర్నీ చూపించాడు.

- Advertisement -

ఈ మాత్రం దానికి అంత దూరం అవసరమేముంది?

టీజర్ చూసిన తర్వాత ఇతర భాష ప్రేక్షకులకు కన్నప్ప ఏమైనా ఆకట్టుకోవచ్చేమో గాని, భక్త కన్నప్ప చుసిన తెలుగు ప్రేక్షకులకి మాత్రం టీజర్ ఏమాత్రం మెప్పించలేదని చెప్పాలి. టీజర్ లో కాస్ట్యూమ్, విజువల్స్ అంతా కూడా హాలీవుడ్ తరహాలో ఉండేలా మేకర్స్ ఒక ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. కానీ అదే సినిమా కొంప ముంచేలా ఉందని అనిపిస్తుంది. కన్నప్ప టీజర్ చూస్తుంటే ఎక్కడా భారతీయత కనిపించడం లేదు. ఇది ఒక భక్తి సినిమాలా కాకుండా, వార్ డ్రామాగా, ఫాంటసీ టచ్ మాత్రమే ఇచ్చినట్టు భావన కలిగిస్తుంది. ముఖ్యంగా తెలుగు నేటివిటీ ఏమాత్రం కనిపించడం లేదు. అన్నిటికి మించి పాత్రల గెటప్ లలోనే ఎవరినీ సరిగ్గా చూపించలేదని అనిపిస్తుంది. ఇక మంచు విష్ణు గెటప్ ఫస్ట్ లుక్ వచ్చినపుడే ఆకట్టుకోకపోగా, టీజర్ లో కూడా అలాగే కనిపించాడు. ముఖ్యంగా టీజర్ చివర్లో శివయ్యా.. అంటూ శివుడ్ని పిలుస్తాడు. ఆ వాయిస్ లో గాంభీర్యత అనేది లేదు. దాంతో పాత్ర పేలవంగా అనిపిస్తుంది. ఇక స్టీపెన్ డేవస్సి బీజీఎమ్ ఆశించినంత లేదు.

అలాగే కన్నప్ప చిత్రాన్ని న్యూజిలాండ్ వెళ్లి మరీ షూట్ చేయాల్సిన అవసరం ఏముందో ఇప్పటికీ తెలీట్లేదు. ఆ మాత్రం అడవులు మన దేశంలో లేవా? పైగా శివుడి పాత్రకి సంబంధించిన సీన్లు హిమాలయాల పరిసర ప్రాంతాల్లో షూట్ చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు అంటున్నారు. ఇండియన్ మూవీస్ లో భారతీయ సంప్రదాయాలకు సంబంధమున్న గిరిజనులను, ఆటవికులను ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్టుగానే చూపిస్తారు. కానీ టీజర్ లో అలా ఏమి కనిపించలేదు. ఇక టీజర్ ని చూస్తుంటే భక్త కన్నప్ప లో ఉన్న పాత్రలకు మించి ఇందులో ఎక్కువ పాత్రలని ఇరికించారేమో అన్న సందేహం కనిపిస్తుంది. అలాగే సినిమాలో ముఖ్యమైన కైలాస నాథ శాస్త్రి, పార్వతి దేవి, మల్లన్న ఇంకా చాలా పాత్రలను చూపించలేదు. మరి ఆ పాత్రలను వేరే విధంగా చుపిస్తున్నాడా అనేది తెలీదు. కానీ సినిమా టీజర్ ద్వారా హైప్ పెరిగిందన్న మాట వాస్తవం. కానీ ఎలా పెరిగిందో సినిమా బాగా తీయకపోతే అంతకు మించి విమర్శలు అందుకోవడమన్నది తథ్యం. మరి సినిమా నుండి రాబోయే అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు