Pawan Kalyan : గెలిపించి తప్పు చేశామా…? సొంత ఫ్యాన్స్ నుంచి వస్తున్న మాట ఇది !

Pawan Kalyan New Movies : ఒక సెలబ్రెటీకి అభిమానులు ఉండటం కామన్. కానీ, సెలబ్రెటీలే అభిమానులుగా ఉండటం పవన్ కళ్యాణ్ కు మాత్రమే. యాక్టింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా, డ్యాన్స్ అసలు రాకపోయినా, టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు పవర్ స్టార్. ఇటు సినిమాలు.. అటు మంచి పనులు.. ఈ దెబ్బతో అభిమానులు కేవలం హీరో అని కాదు.. దేవుడు అని పిలిచే స్థాయి వెళ్లిపోయాడు కళ్యాణ్. అందుకే ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యాడు.

ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం అయితే, ఆ రాష్ట్ర ప్రజలు పండగ చేసుకుంటారు. కానీ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే రెండు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. ఇటీవల అంబానీ పెళ్లి వేడుకలో కూడా కళ్యాణ్ విజయమే హాట్ టాపక్. దీన్ని బట్టి అర్థం చేసుకొవచ్చు.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో…

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారట. తమ అభిమాన హీరోను అనవసరంగా ఎమ్మెల్యేను చేశామని అంటున్నారట. కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వకముందు, డిప్యూటీ సీఎం అవ్వక ముందు.. ఏడాది ఒక సినిమా కాకపోయినా, రెండేళ్లకు ఒక్క సినిమా అయిన వచ్చేది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.

- Advertisement -

ఈ మధ్య ఓ మీటింగ్‌లో పవన్ ఫ్యాన్స్ OG అప్టేట్ అడిగారు. ఆ టైంలో పవన్ నుంచి వచ్చిన ఆన్సర్‌తో నిజానికి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. “ఇప్పుడు నేను ఓజీ అంటే.. ప్రజలు క్యాజీ అంటారు. ఇక మీద సినిమాలకు ఎక్కువ టైం ఇవ్వను” అంటూ చెప్పి పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో పవన్ ను మళ్లీ సీల్వర్ స్క్రీన్ పై చూడలేమా… అనే ప్రశ్న అభిమానుల్లో వచ్చింది.

పవన్ డిప్యూటీ సీఎంగా అయి చాలా రోజులు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంగారు ఒక్క రోజు కూడా షూటింగ్‌లో పాల్గొనలేదు. వీక్‌లో రెండు రోజులు టైం ఇస్తానని చెప్పినా… అది అవ్వడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

Pawan Kalyan Upcoming Movies
Pawan Kalyan Upcoming Movies

అయితే… ఈ అసంతృప్తిని ఓ హ్యాపీ నెస్ డ్యామినేట్ చేస్తుంది. అదేంటంటే… పవన్ కళ్యాణ్ సినిమాల్లో, నిజజీవితంలో ఎవరికీ తెలియకుండా చేసే సాయం పాలిటిక్స్ లోకి వచ్చి, ఓ ప్రజా ప్రతినిధిగా.. చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకున్నారు. అలాగే ఇప్పుడు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను బాగు చేయ్యడం కేవలం పవన్ కళ్యాణ్‌తోనే సాధ్యం అవుతుందని కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అదే పనిలో ఉండటం వల్ల… ఆయన అభిమానలు హ్యాపీగానే ఉన్నారని చెప్పొచ్చు. సిల్వర్ స్క్రీన్‌లో చూడలేకపోయినా, టీవీల్లో మంచి పనులు చేస్తూ రోజుకో సినిమా చూపిస్తున్నాడు పవన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు