MathuVadalara2 : చిట్టి ఇప్పుడు ‘నిధి’ గా వస్తుంది.. ఈసారి కలిసొచ్చేలా ఉంది..

MathuVadalara2 : టాలెంటెడ్ హీరో శ్రీ సింహ కమెడియన్ సత్య పాత్రల్లో తెరకెక్కిన కామెడీ సినిమా “మత్తు వదలరా”. ఐదేళ్ల కింద వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పుడు టీవీల్లో వేసినా మంచి రేటింగ్స్ రాబడుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా “మత్తు వదలరా2” తెరకెక్కుతోందని తెలిసిందే. మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ వస్తుందని చాలా నెలల నుండే చెప్పుకురాగా, రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక ఈ సీక్వెల్ లో కూడా శ్రీసింహ మరియు సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ఫస్ట్ పార్ట్ దర్శకుడు రితేష్ రానాయే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న మత్తు వదలరా2 సినిమా నుండి లేటెస్ట్ గా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Faria Abdullah as Nidhi in MathuVadalara2 movie

చిట్టి కాస్త నిధిలా మారిపోయింది…

రీసెంట్ గా ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నిధి పాత్రలో కనిపించనుందని మేకర్స్ రివీల్ చేసారు. ఈ పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అప్డేట్ ఇవ్వగా, ఆ పోస్టర్ లో ఫరియా చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా జాతి రత్నాలులో చిట్టి గా ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లా, కొన్నాళ్లుగా వరుస ప్లాప్ లతో సతమతమవుతుంది. ఈ ఇయర్ వచ్చిన ఆ ఒక్కటి అడక్కు కూడా ప్లాప్ అయింది. ఈ క్రమంలో మత్తు వదలరా2 సినిమా ఫరియాకి మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

సెప్టెంబర్ 13న రిలీజ్…

ఇక ఎప్పుడో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం కొన్ని రోజులుగా కన్ఫ్యూజన్ లో ఉండగా, తాజాగా మేకర్స్ మత్తువదలరా సినిమా సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసారు. ఇక క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు సంయక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను రితేష్ రానా దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా కి సంబంధించిన మరిన్ని అప్డేట్ త్వరలో రానున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు