Faria Abdullah: ఆ హీరోతో ఎంజాయ్‌ చేస్తున్న ఫరియా ?

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా ఈ బ్యూటీ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈ బ్యూటీ జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో చిట్టి నా బుల్ బుల్ చిట్టి అనే పాట ద్వారా యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఈ సినిమా విపరీతంగా నచ్చింది.

ఈ సినిమాలో తన అమాయకమైన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించింది. ఏమీ తెలియని లాయర్ పాత్రలో నటించి తన నటనతో నవ్వులు పూయించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ పరియాకు ఆ సినిమా అనంతరం పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సినిమాలో ఫరియాకు ఉన్న క్రేజ్ చూసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఓ ఊపు ఊపేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయిపోయింది.

- Advertisement -

ఈ సినిమాకు అనుదీప్ కేవి దర్శకత్వం వహించగా…. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం ఫరియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తరువాత బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా…. ఫరియా ఓ కోలీవుడ్ స్టార్ హీరోతో ఎంజాయ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఆ హీరోతో కలిసి పబ్బులకు, పార్టీలకు వెళుతుందని ఇండస్ట్రీవర్గాల్లో సమాచారం. ఆ హీరోతో ఎంజాయ్ చేయడమే కాకుండా ప్రేమలో ఉందని అనేక రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై ఫరియ స్పందించింది. ఆ హీరోతో నాకు కేవలం స్నేహం మాత్రమే ఉందని….మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమలు లేవు అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు