Faria Abdullah: వామ్మో..అందాలతోనే చంపేటట్టు వున్నావే..?

Faria Abdullah.. ప్రముఖ హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈమె తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంది. అయితే ఈమె హైట్ ఈమె కెరియర్ కు శాపంగా మారిందని చెప్పవచ్చు..అవకాశాలు రాలేదు.. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలైనా వస్తాయి అంటే అది కూడా లేనట్టే.. అడపా దడపా ఐటమ్ సాంగ్ లలో నటిస్తూ అలరిస్తోంది. మరొకవైపు బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన ఈమె. ఆ తర్వాత పెద్దగా అలరించలేదు. ఇటీవలే అల్లరి నరేష్ తో ఆ ఒక్కటి అడక్కు సినిమాలో కనిపించింది ఫరియా అబ్దుల్లా..

Faria Abdullah: Wow..does beauty kill you?
Faria Abdullah: Wow..does beauty kill you?

యూట్యూబర్గా ప్రయాణం.

ఇండస్ట్రీ లోకి రాకముందు తొలుత యూట్యూబర్ గా అందరికీ పరిచయమైన ఈమె.. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో దగ్గర అయింది.. రాహుల్ రామకృష్ణ , నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి కీలక పాత్రల్లో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీలో హీరోయిన్ గా నటించి అందరి మనసులు దోచుకుంది.. తన గ్లామర్ తోనే కాకుండా కామిడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది.. మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి అగ్రస్టార్ హీరో ప్రశంసలు అందుకున్న ఈమెకు.. అందరూ తిరుగు లేదనుకున్నారు.. కానీ ఊహించిన దానికంటే భిన్నంగా కెరియర్ సాగుతోంది.. జాతి రత్నాలు తెచ్చి పెట్టిన క్రేజ్ అవకాశాలు తీసుకురాలేకపోతోంది.. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ బ్యూటీగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈమె.. ఐటమ్ సాంగ్ చేసింది.. గుర్తింపు వచ్చింది.. కానీ సినిమాలలో అవకాశాలు రాలేదు..

అన్ని సినిమాలు డిజాస్టర్..

మాస్ మహారాజా రవితేజ రావణాసుర చిత్రంలో కూడా నటించింది.. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈమె ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. ఇక ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసింది.. అది కూడా డిజాస్టర్ గానే నిలిచింది. అంతకుముందు వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఫరియా అబ్దుల్లా తాజాగా కన్నుకొడుతూ లేలేత పరువాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

అందాలతో చంపేస్తోన్న ఫరియా అబ్దుల్లా..

సోషల్ మీడియా ఖాతాలో తాజాగా తన అందాలను షేర్ చేస్తూ ఫోటోలు పంచుకుంది.. ఇవి చూసిన అభిమానులు..మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.. మరి కొంతమంది సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న హంగామాకి ఫాలో అవుతూ సబ్స్క్రైబర్లుగా కూడా మారుతున్నారు. మొత్తానికి అయితే అందాలతోనే చంపేటట్టు ఉన్నావే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా కన్నుగీటుతూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఇలాగైనా పర్యాయ అబ్దుల్లాకు సినిమాలలో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. మరి ఈమె అదృష్టం ఎంత మేర ఉందో చూడాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు