Prasanna vadanam : ఆహాలో ఆల్ టైం రికార్డు రెస్పాన్స్ తెచ్చుకున్న ప్లాప్ సినిమా!

Prasanna vadanam : టాలీవుడ్ ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, చిన్న పాత్రలు వేస్తూ, ఆ తరువాత ఏకంగా హీరోగా నూ సక్సెస్ అయ్యి తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో సుహాస్. ఈ కుర్ర హీరో ఈ ఏడాది అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి డీసెంట్ హిట్ ని సొంతం చేసుకోగా, ఆ తర్వాత మరో ప్రయోగాత్మక సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో సుహాస్ నటించిన మూవీ ప్రసన్న వదనం (Prasanna vadanam) కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం అనుకున్న రేంజ్ లో హోల్డ్ ని చూపించ లేక పోయింది. ఎలక్షన్స్ అండ్ IPL మ్యాచుల వలన రన్ త్వరగానే కంప్లీట్ అయింది. కానీ మంచి సినిమా అన్న పేరు వచ్చిన ప్రసన్న వదనం సినిమా కి వచ్చింది.

Fastest 50 million streaming record in Aha is Prasanna Vadanam movie

డిజిటల్ లో దుమ్ములేపుతున్న సినిమా..!

అయితే రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది ప్రసన్నవదనం సినిమా. ఆహా వీడియోలో సినిమా డిజిటల్ రిలీజ్ సొంతం చేసుకోగా OTT రిలీజ్ తర్వాత ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సూపర్ పాజిటివ్ గా సొంతం చేసుకుంది. ఇక ప్రసన్న వదనం సినిమా కి ఇక్కడ వ్యూవర్ షిప్ సాలిడ్ గా, పెరిగి పోగా ఓవరాల్ గా సినిమా ఆహ వీడియో ప్లాట్ ఫామ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ యూనిక్ 1 మినట్ వాట్చ్ టైం ను సొంతం చేసుకుని రికార్డ్ కొట్టిందట. ఆహా నుండి అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా సినిమాను చూడని వాళ్ళు కూడా ఇప్పుడు ఎగబడి సినిమాను చూడటానికి సిద్ధం అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన మేర సక్సెస్ అవ్వలేక పోయిన ప్రసన్న వదనం సినిమా ఇప్పుడు డిజిటల్ లో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పాలి.

- Advertisement -

భారీ హైప్ తో రిలీజ్ అయి ప్లాప్!

ఇక ప్రసన్నవదనం సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినపుడు మంచి హైప్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోకి, ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బు ఉంటుంది. అంటే ఎంత క్లోజ్ గా ఉన్న వాళ్ళని అయినా గుర్తుపట్టకపోవడం. ఈ క్రమంలోనే హీరో తో తాను చేయని తప్పుకు బలైపోతూ ఉండగా, ఆ సమస్య కి పరిష్కారం కనుక్కున్నాడా లేదా? ఆ జబ్బు వల్ల హీరోకి వచ్చిన ఇబ్బంది ఏమిటీ అనేది సినిమా కాన్సెప్ట్. విభిన్న కథతో వచ్చిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిచగా, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించారు. అర్జున్ వైకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులని అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఐపీఎల్ వల్ల, అలాగే సమ్మర్ ఎండలు, ముఖ్యంగా ఎన్నికల వల్ల ఈ సినిమాకు కలెక్షన్లు రాక, యావరేజ్ అవ్వాల్సిన సినిమా ప్లాప్ అయింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు