Fastest video Songs: తక్కువ సమయంలోనే 300 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ ఇవే..!

Fastest video Songs.. ఈ మధ్యకాలంలో బడా స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి విడుదలైన ఏ అంశమైనా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది.. ఇక పాటల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సినిమా నుంచి ఒక పాట విడుదల అయిందంటే చాలు అతి తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ సాధించి రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే విడుదలైన అతి తక్కువ సమయంలోనే యూట్యూబ్లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించిన సినిమా పాటల గురించి ఇప్పుడు చూద్దాం..

గుంటూరు కారం:

Fastest video songs: These are the songs that got 300 million views in a short time..!
Fastest video songs: These are the songs that got 300 million views in a short time..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం.. ఇటీవల విడుదలై ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇక ఇందులో “కుర్చీ మడతపెట్టి “పాట యూట్యూబ్లో విడుదలై.. ఈ పాట ఎంతలా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది అంటే 300 మిలియన్ వ్యూస్ ను కేవలం 131 రోజుల్లోనే రాబట్టి రికార్డు సృష్టించింది.. ఇక ఈ పాటలో మహేష్ బాబు, శ్రీ లీల తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.. ఇక తమన్ అందించిన మాస్ బీట్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి.. అలా ఈ సినిమా తక్కువ సమయంలోనే 300 మిలియన్ న్యూస్ సాధించి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

- Advertisement -

బీస్ట్:

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో సన్ పిక్చర్స్ బ్యానర్ పైన విడుదలైన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం బీస్ట్.. 2022లో పూజా హెగ్డే హీరోయిన్గా, విజయ్ దళపతి హీరోగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమా నుండీ వచ్చిన “హలమితి హబీబో “పాట కేవలం 157 రోజుల్లోనే 300 మిలియన్ వ్యూస్ రాబట్టింది.

అలా వైకుంఠపురంలో..

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురంలో.. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక ఇందులో ” బుట్ట బొమ్మ “పాట 158 రోజుల్లో 300 మిలియన్ వ్యూస్ రాబట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.

పుష్ప:

సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ గర్ల్ గా నటించిన చిత్రం పుష్ప.. ఈ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ లో నటించి అందరిని అబ్బురపరిచింది.. అంతేకాదు ఇలా ఐటమ్ సాంగ్లో మొదటిసారి నటించినా.. సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసింది.. ఇందులో సమంత “ఉ అంటావా ఉ ఊ అంటావా” అనే పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ పాట 265 రోజుల్లో ఏకంగా 300 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు సృష్టించింది.

ఇక మొత్తానికైతే అతి తక్కువ సమయంలోనే 300 మిలియన్ వ్యూస్ సాధించి గుంటూరు కారం లో ” కుర్చీ మడతపెట్టి ” పాట రికార్డు సృష్టించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు