Devara Song: ‘దేవర’ సాంగ్‌..మరో అప్డేట్‌ వచ్చేసింది..!

Devara Single: టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి వారసత్వాన్ని అందించుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్… తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా అయినా.. సరే… ఇలాంటి పాత్ర అయినా సరే… ఎన్టీఆర్ చేశాడంటే ఆ పాత్రకే అందం వస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్… ఇప్పుడు దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తుంటే… ఆయన సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ నటిస్తున్నారు. ఈ బ్యూటీకి ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిది కావడం విశేషం. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ వచ్చింది. నిన్న FearSong సాంగ్ ప్రోమోను వదిలిన చిత్ర బృందం… ఇవాళ మరో అప్డేట్ ఇచ్చింది. రేపు.. ఏ సమయానికి ఈ ఫుల్‌ సాంగ్ రిలీజ్ చేస్తామో అనే దానిపై పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం.

ఈ FearSong సాంగ్‌ ను రేపు 7:02PM గంటలకు రిలీజ్‌ చేయబోతున్నట్లు తెలిపింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది. కాగా ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అనిరుద్ సంగీతం అందిస్తున్న నేపథ్యంలో.. దేవర సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. అటు తమిళ ఇండస్ట్రీలో కూడా దేవరకు ఆదరణ లభిస్తోంది. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో అలాగే జైలర్ సినిమాలు ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దేవర సినిమా కూడా బంపర్ హిట్ అవుతుందని అందరూ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు