Devara: “దేవర” కోసం 5 గురు స్టార్లు..గూస్ బంప్స్ రావాల్సిందేగా..!

FearSong will ignite your souls from 7:02 PM today: జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. అయితే… ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. అంతేకాదు… టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “దేవర” కూడా ఒకటి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్ అంచనాలను మించి అభిమానులను ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ సినిమా నుండి రాబోయే అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ మరింత వెయిట్ చేస్తున్నారు.

Image

- Advertisement -

ఇది ఇలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కానుకగా “దేవర” నుంచి ఇవాళ రాత్రి 7:02 గంటలకు ఫియర్ సాంగ్ రానుంది. ఈ పాటలోని ప్రతి లైన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని “దేవర” మూవీ టీం తెలిపింది. గేయ రచయితలు బ్లేడ్ లాగా ప్రతి లైన్ ను చెక్కుతూ రాసారని పేర్కొంటూ రచయితల పేర్లను వెల్లడించింది.

తెలుగులో రామజోగయ్య శాస్త్రి, తమిళంలో విష్ణు ఏడవన్, హిందీలో మనోజ్ ముంతాషిర్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో ఏం. గోపాలకృష్ణన్ రచించినట్లు పేర్కొంది “దేవర” చిత్ర బృందం. దీంతో దేవర కోసం ఏకంగా 5 గురు రంగంలోకి దిగుతున్నారని ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇకపై అందరికీ గూస్‌ బంప్స్‌ వస్తాయని కామెంట్స్‌ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు