Satya Krishnan : డిస్ట్రిబ్యూటర్‌గా మారుతున్న నటి… సపోర్ట్ బాగానే ఉందిగా..

Satya Krishnan : ఈ మధ్య సినీ తారలు సినిమాల్లో నటించడం మాత్రమే కాదు. సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. కొందరు సినిమాలకు నిర్మాతలుగా మారుతూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు మరో సినీ నటి డిస్టిబ్యూటర్ గా మారుతుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు క్యారక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణ.. ఈమె గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అక్కగా, చెల్లిగా, కూతురుగా సినిమాల్లో నటించి తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. ఆమె గొంతు పై కామెంట్స్ వచ్చిన పట్టించుకునేది కాదు. ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఈమె తాజాగా డిస్టిబ్యూటర్ గా మారుతుందని ఓ వార్త షికారు చేస్తుంది. అసలు మ్యాటరేంటంటే..

సత్య కృష్ణ పేరు గత ఇరవై ఐదేళ్ల నుంచి ఇండస్ట్రీలో రానిస్తుంది. దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న సత్య కృష్ణన్.. హీరోయిన్‌గానే కాకుండా.. వదిన, అక్క, తల్లి పాత్రల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆనంద్, బొమ్మరిల్లు, మెంటల్ కృష్ణ.. ఇలా చాలా సినిమాల్లో నటించింది సత్య. ఆమె నటనతో పాటు.. ఆమె హస్కీ వాయిస్‌కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అయ్యింది. సినిమాలతో తప్ప బయట పెద్దగా కనిపించదు. కొన్నేళ్ల క్రితం వరకు ఆమెకు సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవని తెలుస్తున్నాయి. ఇటీవలే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా ఈమె నటనకు స్వస్తి చెప్పి డిస్ట్రిబ్యూటర్ గా మారుతుందని తెలుస్తుంది.

Film actress Satya Krishna who is going to become a distributor of movies
Film actress Satya Krishna who is going to become a distributor of movies

సత్య కృష్ణ డిస్ట్రిబ్యూటర్ గా మారుతుందనే వార్తలు ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈమెకు సపోర్ట్ గా ఓ పెద్ద మనిషి ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఆమెకు అన్ని విధాలుగా సహాయంగా ఉండటంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు టాక్.. అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈమె ఈ మధ్య పెద్దగా సినిమాల్లో నటించినట్లు లేదు. ఇక ముందు పూర్తిగా సినిమాలకు దూరం అవుతుందని తెలుస్తుంది. మరి ఈ వార్తలపై సత్య కృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు