Film Chamber: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ఎప్పుడంటే..?

Film Chamber…ఇండస్ట్రీలలో ఫిలిం ఛాంబర్ ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల వల్ల ఫిలిం ఛాంబర్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని, ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా సరే ఫిలిం ఛాంబర్ లో చెప్పుకుంటే నెరవేరుతుందని, ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ లో సభ్యులుగా ఉండే వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటుందని, అందరూ అంటారు. అందుకే సరైన నాయకులను ఎన్నుకోవడానికి సినీ సెలబ్రిటీలు సైతం ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఎలక్షన్స్ జరిగి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 8వ తేదీన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించాలి అని ఫిలిం ఛాంబర్ సభ్యులు నిర్ణయించారు. అందులో భాగంగానే సెప్టెంబర్ 8వ తేదీన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి

Film Chamber: Telangana Film Chamber Elections.. When..?
Film Chamber: Telangana Film Chamber Elections.. When..?

ఫిలిం ఛాంబర్ స్థాపనకు 14 ఏళ్ళు..

ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్థాపించి దాదాపు 14 సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికల కోసం అడ్వైజర్లుగా సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కరరావు, జేవిఆర్ , నిర్మాత గురురాజు వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్ ఆఫీసర్గా అడ్వకేట్ నరసింహారావు బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది సెప్టెంబర్ 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు

24 క్రాఫ్ట్స్ 16,000 మంది సభ్యులు..

ఫిలిం ఛాంబర్ లో ఇప్పటికే దాదాపు 1000 మంది ప్రొడ్యూసర్స్, 16 వేల మంది 24 క్రాఫ్ట్స్ మెంబర్స్ ఉన్నారు. ఇందులో ఉండే సభ్యులకు ఇన్స్యూరెన్స్ , సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాము. సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా ఫిలిం ఛాంబర్ పనిచేస్తోంది. సభ్యులందరూ కూడా తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను అంటూ ఆయన తెలిపారు.

- Advertisement -

తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు ప్రాధాన్యత లేదు..

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ పేరిట సినీ ఇండస్ట్రీలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు బహుకరిస్తున్న విషయం తెలిసిందే. అవార్డు కమిటీని ఎఫ్ డి సి వారు ప్రకటించారు. తెలంగాణకు సంబంధంలేని వ్యక్తులు ఎఫ్డిసి లో పనిచేస్తున్నారు కాబట్టి వారు మా చాంబర్ కు ప్రాధాన్యం లేకుండా చేశారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను. కమిటీని రివైజ్ చేయాలని కోరుతున్నాను అంటూ ఆయన తెలిపారు.

ఫిలిం ఛాంబర్ ఎన్నికల ప్రక్రియ మొదలు..

అలాగే తెలంగాణ ఫిలిం చాంబర్ వైస్ ప్రెసిడెంట్ గురురాజు మాట్లాడుతూ .. ఫిలిం ఛాంబర్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఒకటవ తేదీ ఉంటుంది. రెండవ తేదీ నామినేషన్స్ పరిశీలించి సభ్యులను కన్ఫార్మ్ చేస్తారు. ఇక ఎనిమిదవ తేదీన ఎన్నికలు జరుగుతాయి. మా చాంబర్ నుండి ఇప్పటి వరకు దాదాపు 250కి పైగా సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు చేయూతనివ్వడానికి కూడా మా చాంబర్ పనిచేస్తుంది అని ఆయన తెలిపారు.

సినిమా నటుల పట్ల 50 సంవత్సరాలుగా వివక్షత కొనసాగుతోంది.

అలాగే నిర్మాత జేవిఆర్ కూడా మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో కూడా తెలంగాణ నిర్మాతలు నటులు సాంకేతిక నిపుణుల పట్ల వివక్ష చూపించారు. ఈ వివక్షత దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతోంది. గద్దర్ అవార్సు కమిటీలో కూడా తెలంగాణ ఛాంబర్ కు ప్రాతినిధ్యం లేకుండా చేశారు.ఈ కమిటీని రివైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అంటూ తెలిపారు

సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి.

ఇక సుదర్శన్ థియేటర్ అధినేత భాస్కర్ రావు కూడా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి, సహాయ సహకారాలు అందించాలి అంటూ కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు