Film industry: దారుణం.. ప్రాణాల గుప్పెట్లో తల్లి.. ఆస్తుల కోసం హీరోయిన్ గొడవ..కట్ చేస్తే..!

Film industry.. వనిత విజయ్ కుమార్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఈమె సినిమాలకంటే వ్యక్తిగత విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని హాట్ టాపిక్ గా మారింది. గతంలో దేవి సినిమాలో భానుచందర్ కి భార్యగా నటించిన ఈమె మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కూడా నరేష్ భార్యగా నటించి అలరించింది.. ఇక ఇది తన జీవితంలో జరిగిన కథ అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది.. ఇకపోతే సీనియర్ నటుడు విజయ్ కుమార్ రెండవ భార్య, ప్రముఖ నటి మంజుల కూతురే ఈమె.. తల్లిదండ్రులు ఇద్దరూ ఇండస్ట్రీలో నటులు గానే కొనసాగారు..

ప్రాణాల కోసం తల్లి పోరాటం.. ఆస్తి కోసం హీరోయిన్ గొడవ..

Film industry: Atrocious.. Mother lost her life.. Heroines fight for property.. If cut..!
Film industry: Atrocious.. Mother lost her life.. Heroines fight for property.. If cut..!

ఇకపోతే వనిత విజయ్ కుమార్.. గతంలో తన తల్లి ఆస్తి తనకు ఇవ్వకుండా తన తండ్రి మోసం చేశాడు అంటూ వనిత విజయ్ కుమార్ కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.. ఇక ఈ విషయంపై తాజాగా మరొక వార్త వైరల్ గా మారుతోంది. తల్లి ప్రాణాల కోసం పోరాడుతుంటే కూతుర్లు మాత్రం ఆస్తి కోసం గొడవపడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది..అసలు విషయంలోకి వెళితే మంజులకు కామర్లు ఎక్కువయ్యాయట.. అయితే హెచ్చరించినా ఆమె వినలేదు.. కానీ ఒకసారి మద్యం సేవించడం వల్ల ఆ కామెర్లు కాస్త ఎక్కువ అయ్యాయట.. ఆసుపత్రికి తీసుకెళ్తే 72 గంటల్లో ఈమె చనిపోతుందని వైద్యులు చెప్పారట.. ఇక ఈ విషయంపై వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ..మా అమ్మ మరో 72 గంటల్లో చనిపోతానని తెలిసి కూడా.. మా గురించి ఆలోచించింది. నేను లేకపోతే మీకు ఆస్తి దక్కదు అని కూడా మాతో చెప్పింది. ఆసుపత్రి బెడ్ మీద ఉంటూనే ఢిల్లీలోని ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానికి ఫోన్ చేసి తన పిల్లలకు రావాల్సిన ఆస్తిని వారి పేరుపై మార్చాలి డాక్యుమెంట్ సిద్ధం చేయండి అని కోరింది. అలాగే వాంగ్మూలంగా వీడియో కూడా తీయాలి అని చెప్పింది.. ఈ సమయం లో ఇది కరెక్ట్ కాదు వద్దని చెప్పాను.. అప్పుడు నాన్న వనిత బాగోగులు నేను చూసుకుంటాను ఆమెకు అన్యాయం జరగనివ్వను అని చేయి పట్టుకొని చెప్పాడు.. అప్పుడు అమ్మ నమ్మింది.. నేను కూడా నమ్మాను.. కానీ అమ్మ మరణించిన తర్వాత అంతా తలకిందులు అయిపోయింది. అంతక్రియలకు కూడా నాన్న మమ్మల్ని రానివ్వలేదు.. ఆ సమయంలో బాగా గొడవపడ్డాము ఆస్తిమాకు ఇవ్వాలని ఎంతో ప్రయత్నం చేశాను దానితో నాన్న మమ్మల్ని రానివ్వలేదు. అప్పుడు శరత్ కుమార్ , రాధా రవి మమ్మల్ని పిలిచి అంత్యక్రియలు చేయించారు.

ఆస్తి కోసం తండ్రి పై కేసు..

ఆమె చనిపోయిన తర్వాత ఆస్తిలో నాకు హక్కు లేదని.. ఆస్తి పంచితే అది నాకు కూడా చెందుతుందని.. అది దక్కకుండా నన్ను తమ వద్దకు రానివ్వడం లేదు అంటూ ఆమె వాదిస్తోంది. అయితే తల్లి శవాన్ని పక్కన పెట్టుకొని.. వీరు ఇలా ఆస్తి కోసం గొడవలు పడడం నిజంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇకపోతే ఇప్పటికే తనకు రావాల్సిన ఆస్తి ఇవ్వలేదని ఆమె కామెంట్లు చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు