Vedaa : ప్లాప్ సినిమాకి సెలెబ్రేషన్స్ ఏంటి?.. స్టార్ హీరో పరువుతీస్తున్న నెటిజన్లు..

Vedaa : ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయితే చిత్ర ఉంటే సెలెబ్రేషన్లు చేయడం మామూలు విషయమే. ఆ సినిమా సక్సెస్ అవ్వాలని రిలీజ్ కి ముందు ఈవెంట్ చేస్తారు. సక్సెస్ అయ్యాక కూడా సెలెబ్రేట్ చేస్తారు. అయితే ఈ మధ్య ప్లాప్ అయ్యాక కూడా సక్సెస్ అయిందంటూ సెలెబ్రేట్ చేస్తున్నారు కొందరు నిర్మాతలు. సౌత్ లో చాలా తక్కువ గాని, బాలీవుడ్ లో మాత్రం ఎక్కువయిపోయింది. అయితే తాజాగా ఓ బాలీవుడ్ మేకర్స్ తమ సినిమా సక్సెస్ అయిందని సెలెబ్రేట్ చేసుకున్నారు. నిజానికి ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. కానీ మేకర్స్ మాత్రం సక్సెస్ అయిందని పార్టీ చేసుకోవడంతో బాలీవుడ్ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.

Film Unit in Veda Movie Success Celebrations

ప్లాప్ అయిన సినిమాకి సెలబ్రేషన్స్ ఏంటి?

తాజాగా పంద్రాగస్టు స్పెషల్ గా బాలీవుడ్ లో మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో జాన్ అబ్రహం నటించిన ‘వేదా’ (Vedaa) సినిమా ఒకటి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని డిజాస్టర్ అయింది. కానీ తమ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటూ మేకర్స్ సెలెబ్రేట్ చేసుకున్నారు. దీంతో బాలీవుడ్ జనాలు ఆ చిత్ర యూనిట్ ని నెట్టింట తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు, ఇలా సెలెబ్రేట్ చేస్తే.. క‌నీసం పెట్టిన పెట్టుబడిలో పావు వంతు అయినా రికవ‌రీ అవుతుంది అన్న న‌మ్మ‌కంతో ఇలాంటి పార్టీలు సెల‌బ్రేట్ చేస్తుంటారు మేకర్స్. ఇదో కొత్త రకం స్ట్రాటజీ. కానీ పూర్తిగా డిజాస్టర్ అయిన సినిమాకు ఇలాంటి ప్రమోషన్లు అవసరమా అంటూ ఆడియన్స్ విమర్శిస్తున్నారు.

- Advertisement -

ఆగష్టు 15న జాన్ అబ్ర‌హం, శార్వ‌రీ వాఘ్, అభిషేక్ బెన‌ర్జీ, అశిష్ విద్యార్ది ప్రధాన పాత్రల్లో న‌టించిన “వేద” రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, వీకెండ్ లో కేవలం 11 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ చిత్ర యూనిట్ మాత్రం తమ సినిమా సక్సెస్ అయిందంటూ.. చిల్ అవుతున్నామంటూ సోష‌ల్ మీడియాలో సెలబ్రేషన్ పిక్స్ పెట్టి మ‌రీ చెప్తున్నారు. దీంట్లో హీరో జాన్ అబ్ర‌హం కూడా ఉన్నాడు. ఈ విషయంపై బాలీవుడ్ జనాలు తెగ ట్రోల్ చేస్తుండగా, కనీసం బిజినెస్ లో సగమైనా తీసుకువచ్చిందా కామెడీ కాకపోతే… రొట్ట సినిమాలు తీసి జనాల మీదకు వదలడం దేనికి అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు