FilmFare Awards -2024: సత్తా చాటిన యంగ్ యాక్టర్స్..!

Filmfare Awards -2024.. తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుక నిన్నటి రోజున రాత్రి హైదరాబాదులో చాలా గ్రాండ్గా జరిగింది.. 69 వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 లో భాగంగా అత్యుత్తమ టాలెంట్ ప్రదర్శించిన వారికి ఈ అవార్డులను బహుకరించారు. ముఖ్యంగా ఇక్కడికి తెలుగు , తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషల నటీనటులు సైతం ఈవెంట్ కి హాజరయ్యారు. ఇక్కడ చాలామంది సెలబ్రిటీలు సైతం తమ ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు. యంగ్ హీరోలు, హీరోయిన్స్ తదితరులు సైతం ఇక్కడికి వచ్చి మరీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలాగే నామినేషన్ జాబితాలో ఉన్నటువంటి వారిలో విజేతలను కూడా ప్రకటించడం జరిగింది.

Filmfare Awards -2024: Young actors who have shown their potential..!
Filmfare Awards -2024: Young actors who have shown their potential..!

ఒక్కసారిగా ఈ వేడుక చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఇక అవార్డుల విషయానికి వస్తే, చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న బలగం సినిమాకి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ డైరెక్టర్ గా బలగం వేణు అవార్డుని అందుకోవడం జరిగింది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా సినిమాకు గానూ, నాని యాక్టింగ్ కి, కీర్తి సురేష్ నటనకు ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ పరిచయ డైరెక్టర్ అవార్డును కూడా అటు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా అందుకున్నారు.

డైరెక్టర్ శౌర్యవ్ కూడా హాయ్ నాన్న చిత్రానికి పరిచయ దర్శకుడిగా అవార్డును సైతం అందుకున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాగా విడుదలైన మరో సినిమా బేబీ సినిమాకి కూడా పలు రకాల అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం క్రిటిక్స్ విభాగంలో డైరెక్టర్ సాయి రాజేష్ అందుకోగా.. ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగంలో వైష్ణవి చైతన్య బేబీ చిత్రానికి అందుకుంది. ముఖ్యంగా ఈసారి యంగ్ నటీనటులు సత్తా చాటుతూ ఫిలింఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. మరి ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

69వ ఫిలింఫేర్ అవార్డ్స్ – 2024 :

ఉత్తమ చిత్రం – బలగం

ఉత్తమ నటుడు – నాని (దసరా )

ఉత్తమ నటి – కీర్తి సురేష్ (దసరా )

ఉత్తమ దర్శకుడు – వేణు యెల్దండి (బలగం )

ఉత్తమ పరిచయ దర్శకుడు – శ్రీకాంత్ ఓదెల (దసరా), సౌర్యువ్ (హాయ్ నాన్న)

ఉత్తమ చిత్రం క్రిటిక్స్ – సాయి రాజేష్ (బేబీ )

ఉత్తమ నటి క్రిటిక్స్ – వైష్ణవి చైతన్య (బేబీ )

ఉత్తమ నటుడు క్రిటిక్స్ – నవీన్ పోలి శెట్టి ( మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ), ప్రకాష్ రాజ్ (రంగమార్తాండ)

ఉత్తమ సహాయ నటుడు – రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ )

ఉత్తమ సహాయ నటి – రూపా లక్ష్మి ( బలగం )

ఉత్తమ గాయకుడు – శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా… బేబీ )

ఉత్తమ గాయని – శ్వేతా మోహన్ (మాస్టారు.. మాస్టారు.. సార్)

ఉత్తమ గేయ సాహిత్యం – అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా – బేబీ )

ఉత్తమ సంగీతం – విజయ్ బుల్గానిన్ (బేబీ )

ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ – సత్యం సూరన్ (దసరా )

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – కొల్లా అవినాష్ ( దసరా )

ఉత్తమ కొరియోగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తాన్- దసరా )

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు