Kanguva: నయా ట్రెండ్ గురూ… చరిత్రను తవ్వేస్తున్నారు

ప్రేక్షకుల టేస్ట్ మారింది. కథలో కొత్తదనం లేకుండా ఎన్ని కోట్ల బడ్జెట్ తో మూవీ వచ్చినా ప్రేక్షకులు థియేటర్ గడప కూడా తొక్కరు. ప్రేక్షకుల టేస్ట్‌కి తగినట్టు కాకుండా వచ్చిన పెద్ద సినిమాలు బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడ్డాయి. కాగా, ఈ మధ్య కాలంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా కథలపై ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

పిరియాడిక్ యాక్షన్ డ్రామా ట్రెండ్ బాహుబలి నుంచే మొదలైందని చెప్పొచ్చు. బాహుబలికి ముందు పిరియాడిక్ సినిమాలు వచ్చాయి. కానీ, జక్కన్న తెరకెక్కించిన బాహుబలిలో భారీతనం కనిపించింది. ఈ భారీతనం ఆడియన్స్ కు తెగ నచ్చింది. దీంతో బాహుబలి టైప్ లో పిరియాడిక్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు.

మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్ కూడా బాహుబలిని ఇన్‌స్పైరేషన్ గా తీసుకుని పొన్నియిన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించాడు. ఒక మణిరత్నం మాత్రమే కాదు.. చాలా మంది డైరెక్టర్లు బాహుబలి తరహా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

- Advertisement -

Films are made based on history

అందుకోసం చరిత్రలను తవ్వుతున్నారు. మరుగున పడ్డ చరిత్రను బయటికు తీసి, అందులో సూపర్ హీరోలుగా ఉన్న రాజుల కథలను సినిమాలుగా మలుస్తున్నారు. అందులో భారీతనాన్ని యాడ్ చేసి, భారీ సినిమాగా మారుస్తున్నారు. ఈ రోజు గ్లింప్స్ వచ్చిన కంగువ మూవీ కూడా ఇదే కోవాలోకి చెందినదే. 14వ దశాబ్ధం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీ ఒక ట్రైబల్ రాజు గురించి ఉంటుందని తెలుస్తుంది. అడవిపై అధికారం కోసం యుద్ధాలు ఉంటాయని, మరో బాహుబలి లాంటి మూవీ అని తెలుస్తుంది.

Films are made based on history

ఈ రోజు వచ్చిన గ్లింప్స్ ద్వారా.. మారాక్కర్ వంశానికి చెందిన వెలికొండ గోండు ప్రచండక పుత్ర కంగా అనే పాత్రలో సూర్య కనిపిస్తున్నాడని తెలుస్తుంది. గ్లింప్స్ తోనే సినిమాపై భారీ స్థాయిలో హైప్ వచ్చింది. 2024లో విడుదల కాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు సృష్టించబోతుందని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Hollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు