Lady Power Star: ఎట్టకేలకు సాయి పల్లవి కమ్ బ్యాక్ ఇచ్చింది..!

ప్రేమమ్ సినిమాతో సౌత్ ఆడియెన్స్ మనసులో చోటు సంపాదించి ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే వరుస ఆఫర్లు సొంతం చేసుకుంది సాయి పల్లవి. కమర్షియల్ సినిమా పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది సాయి పల్లవి. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో అందరిని ఆకట్టుకొని ‘లేడీ పవర్ స్టార్’ అన్న ట్యాగ్ ని సొంతం చేసుకుంది. అయితే, దక్షిణాదిన క్రేజీ ఆఫర్లతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది సాయి పల్లవి.

వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొంత కాలం పాటు దూరమైన సాయి పల్లవి మళ్ళీ ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని తన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శివ కార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అభిమానుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టింది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. సుమారు ఏడాది పాటుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగిన ఈ సినిమా ఇవాళ కాశ్మీర్ లో ప్రారంభం అయ్యింది.

ఇటీవల ప్రిన్స్ సినిమాతో డీసెంట్ అందుకున్న శివకార్తికేయన్ నుండి వస్తున్న సినిమా కావటం, అందులోను సాయిపల్లవి చాలా కాలం తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వటం, కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఆగస్టులో కానీ, దీపావళి సమయంలో కానీ విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు