Sudheer Babu: నా నెక్స్ట్ సినిమా ఏంటో కనిపెట్టండి, సుధీర్ బాబు ఆసక్తికర పోస్ట్

Sudheer Babu: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోగా నిలబడడానికి అంటే ముందు డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నాడు సుదీర్ బాబు. తన ఫ్రెండ్స్ అయినటువంటి యూవి క్రియేషన్స్(Uv Creations) వంశీ 70mm క్రియేషన్స్ విజయ్ కలిసి కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాలో సమంతకు అన్నయ్యగా నటించాడు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుదీర్ (Sudheer Babu) కెరీర్ లో ప్రేమ కథ చిత్రం మంచి హిట్ గా నిలిచింది. ఆ క్రైమ్ కామెడీ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించి హీరోగా సుధీర్ బాబును నిలబెట్టింది. అయితే ఈ ప్రాసెస్లో సుధీర్ బాబుకి చాలా ఫెయిల్యూర్ సినిమాలు వచ్చాయి. ఒక తరుణంలో సుధీర్ బాబుతో సినిమా చేయడానికి వచ్చిన చాలామంది ప్రొడ్యూసర్లు వెనక్కి వెళ్లిపోయారు. సుధీర్ బాబుకి మార్కెట్ లేదు అంటూ చాలామంది మాట్లాడుకునే వాళ్ళు.

Sudheer Babu

- Advertisement -

ఇక రీసెంట్ గా హరోం హర(Harom Hara) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు సుధీర్. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ను అందుకుంది. అలానే ఓటీటీ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ప్రస్తుతం సుదీర్ బాబు తన తదుపరి సినిమాను అనౌన్స్ చేస్తున్నాడు. నేను తెలుగు మరియు హిందీలో చేయబోయే సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయండి అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. వీటితోపాటు ఈ విధంగా క్లూస్ కూడా ఇచ్చాడు. అది ఒక ఆది యోగి పేరు!! చంద్రుని తలపై కిరీటంగా కలవాడు, ఎర్రని సర్పమాలతో కేశాలను బిగించి ముడివేసిన వాడు. దీనిని బట్టి మహదేవ్, రుద్ర, శివ వంటి పేర్లు సినిమా టైటిల్ గా వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు