Fish Venkat : ఏందసలు నాకీ ఖర్మ? చిరు, చరణ్ లు ఫోన్ చేయడంపై ఫిష్ వెంకట్ షాకింగ్ రియాక్షన్

Fish Venkat : ఒకప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా ఓ వెలుగు వెలిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో, ఫినాన్షియల్ సమస్యలతో కష్టాలు పడుతున్నాడు అనే వార్త వైరల్ అవుతోంది. దీంతో ఆయన కష్టాన్ని గుర్తించిన కొంతమంది సినీ పెద్దలు ఫిష్ వెంకట్ కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. పైగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆయనకు ఫోన్ చేసి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కానీ తాజాగా ఈ విషయం గురించి ఫిష్ వెంకట్ స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.

చిరు, చరణ్ లు ఫోన్ చేయడంపై ఫిష్ వెంకట్ షాకింగ్ రియాక్షన్

ఇటీవల ఫిష్ వెంకట్ తన ఇంటి దగ్గర ఓ యూట్యూబ్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను వెండితెరకు దూరంగా ఉండటం వెనుక ఉన్న దురదృష్టకరమైన నిజాన్ని వెల్లడించింది. తాను కిడ్నీ ఫెయిల్యూర్‌తో పోరాడుతున్నానని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నానని వెల్లడించారు. ఆరోగ్య సమస్యల కారణంగా షూటింగ్ కు వెళ్లలేకపోతున్నాను అని వెల్లడించారు. షుగర్ వల్ల కాలు వాపు వచ్చి, దానిపై ఉన్న చర్మం ఊడిపోతోందని, నిలబడలేకపోతున్నాను అని ఆవేదనను వ్యక్తం చేశారు. డయాలసిస్‌, వైద్య ఖర్చుల భారంగా మారడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్సను కొనసాగిస్తున్నాడు. ఫిష్ వెంకట్ పరిస్థితి విషమించడంతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర సినీ పరిశ్రమలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. నెటిజన్లు ఆందోళనను వ్యక్తం చేస్తూ పలువురు సినీ ప్రముఖుల దృష్టిని విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయనకు హెల్ప్ చేయడానికి పలువురు ముందుకొచ్చారు. అందులో భాగంగానే చిరు, చరణ్ కూడా ఆయన పరిస్థితి గురించి ఫోన్ లోనే అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ విషయం గురించి స్పందిస్తూ నాకు ఇదేం ఖర్మ అంటూ బాధ పడ్డారు ఫిష్ వెంకట్.

Fish Venkat : కమెడియన్ ఫిష్ వెంకట్.. ఇప్పుడు దయనీయ స్థితిలో.. కాళ్ళు పాడయి.. డబ్బులు లేక, కొడుకులు పట్టించుకోక..

- Advertisement -

ఇదేం ఖర్మ ?

తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ మాట్లాడుతూ తనకు దిల్ రాజు, చిరంజీవి, రామ్ చరణ్ వంటి పెద్దలతో పాటు చాలా మంది ఫోన్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎంతోమంది స్టార్స్ తో కలిసి పని చేసిన తనకు అడిగితే సహాయం చేసేవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, కానీ తాను మాత్రం అడగకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరికీ విషయాన్ని చెప్పలేదని వెల్లడించారు. తనకు ఒకరి నుంచి సహాయం పొందడం ఇష్టం లేకనే ఇన్నాళ్ళూ హెల్ప్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నా ఎవ్వరినీ చెయి చాచి సహాయం అర్థించలేదని చెప్పుకొచ్చారు ఫిష్ వెంకట్. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఫోన్ చేసి విషయం అడుగుతున్నారని, అసలు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తున్నారని చెప్పారాయన. అలా అడుగుతున్న వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఫోన్ ఎప్పుడూ మోగుతూనే ఉంది.. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు ఫిష్ వెంకట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు