Tollywood : పంద్రాగస్టుకి తెలుగు రాష్ట్రాల్లోనే 100కోట్ల యాపారం..

Tollywood : టాలీవుడ్ లో ఈ ఇయర్ సంక్రాంతి పండగతో మంచి ఆరంభం దొరికిందని టాలీవుడ్ సినీ ప్రియులు సంతోషించారు. సమ్మర్ లో భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతాయని వేల కోట్ల లెక్కలు సెట్ కాబోతున్నాయని ఆశించారు. కానీ సమ్మర్ ని పూర్తిగా దెబ్బేసి పెద్ద సినిమాలతో పాటు, మీడియం రేంజ్ సినిమాలు కూడా వాయిదా పడేసరికి సమ్మర్ బోసిపోయింది. దాదాపు మూడు నెలల పాటు టాలీవుడ్ లో ఒక్క హిట్టు సినిమా కూడా పడలేదు. ఫైనల్ గా కల్కి తో టాలీవుడ్ ఊపిరిపీల్చుకుంది. కానీ ఆ తర్వాత కూడా సరైన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటివరకు మళ్ళీ రాలేదని చెప్పాలి. అయితే తాజాగా ఆగష్టు 15న ఏకంగా ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బరిలో నిల్చుంటున్నాయి. ఆ రోజు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం ఉండబోతుంది, అందులో మూడు పెద్ద సినిమాలు కాగా, మరో రెండు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి.

Five crazy movies are releasing in Tollywood on August 15

పంద్రాగస్టుకి వంద కోట్ల యాపారం..

ఇదిలా ఉండగా స్వతంత్ర దినోత్సవ పండగ నాడు టాలీవుడ్ లో ఏకంగా 5 క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతుండగా, ఆడియన్స్ కూడా ఆరోజు కోసమే ఎదురుచూస్తున్నారు. పైగా నిర్మాతలు కూడా ఆ పండగ సీజన్లో లాంగ్ వీకెండ్ ఉంటుందని వసూళ్లు టాక్ తో సంబంధం లేకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఆగష్టు 15 న విడుదల అవుతున్న సినిమాల్లో ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన ‘డ‌బుల్ ఇస్మార్ట్’, అలాగే రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలు బరిలో నిలవగా, డబ్బింగ్ సినిమా విక్రమ్ నటించిన తంగలాన్ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. ఇక చిన్న సినిమాలు నివేదా థామస్ నటించిన 35 – చిన్న కథ కాదు, నార్నె నితిన్ నటించిన ఆయ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలన్ని కలిపి తెలుగు రాష్ట్రాల్లోనే వంద కోట్ల బిజినెస్ చేశాయట.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్..

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ముందుగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల బిజినెస్ జరగగా, రవితేజ మిస్టర్ బచ్చన్ కి కెరీర్ బెస్ట్ గా 30 కోట్ల బిసినెస్ జరిగిందని సమాచారం. అలాగే చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ కి 10 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. అలాగే చిన్న సినిమాలు ఆయ్, 35 – చిన్న కథ కాదు సినిమాలకు కూడా 5 నుండి 6 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. అలాగే ఆ టైం లో మరికొన్ని డబ్బింగ్ చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయే అవకాశం ఉండగా, ఈ సినిమాలన్నీ కలిపి వంద కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక ఈ సినిమాల వరల్డ్ వైడ్ బిజినెస్ చూసుకుంటే లెక్క నూట యాభై కోట్లకి పైగానే ఉంటుందట. మరి పంద్రాగస్టు పోటీలో ఎవరు గెలుస్తారో, ఏ సినిమా ప్రేక్షకుల్ని ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు