Prabhas : ప్రభాస్ లో అందరికీ నచ్చే ఐదు అంశాలు.. అందుకే డార్లింగ్ కేక..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్.. 44 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికి పెళ్లి ఊసు ఎత్తలేదు.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉంటాయి.. ప్రస్తుతం సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది… రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. ఈ క్రమంలో ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

ప్రభాస్ సినిమాల గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలు అందరికీ తెలుసు.. ఈయన విలక్షణ నటుడు కృష్ణం రాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చాడు.. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు ఆయనకు మంచి పేరును అందించాయి.. అయితే ప్రభాస్ లో కొన్ని అంశాలు అందరికీ నచ్చుతున్నాయి. అవేంటంటే.. ఆయన క్యారెక్టర్.. సాయం అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు.. పది మందికి మంచి జరుగుతుంది అనుకుంటే ఎంత ఖర్చయినా భరిస్తాడు.. తన సొంత ఊరిని ఎప్పటికి మరువడు.. అలాగే తనతో పాటుగా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి తన వాళ్లుగా భావించి ఇంటి భోజనం పెట్టడం.. సినిమాలను ప్రాణంగా ప్రేమించడం.. ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అందుకే డార్లింగ్ అన్నా, సినిమాలు అన్నా ఫ్యాన్స్ కు పిచ్చి.. అదే ప్రేమతో డార్లింగ్ సినిమా కల్కిని సక్సెస్ అయ్యేలా చేశారు..

Five things that everyone likes about Prabhas..
Five things that everyone likes about Prabhas..

ఇక సినిమాల విషయానికొస్తే.. బాహుబలి సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా బాక్సాఫీస్ వద్ద దెబ్బేసింది.. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు సక్సెస్ టాక్ ను అందుకోలేదు.. గత ఏడాది వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బాస్టర్ ను అందుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. ఈరోజు నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి సినిమాలో నటించాడు.. ఈరోజు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.. వీటితో పాటుగా స్పిరిట్, రాజా సాబ్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు