Michael:స్టార్ హీరో తో ట్రైలర్ లాంచ్

రంజిత్ జేకోడి దర్శకత్వంలో ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ”మైఖేల్” ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గతంలో విడుదల చేసిన ఫస్ట్‌ సింగిల్‌, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది.

నట సింహం నందమూరి బాలకృష్ణ , జనవరి 23 న ఈ చిత్రం ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు అని మేకర్స్ సినిమా థీమ్ లో ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ ని సుందీప్ కిషన్ తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకొని, ” మైఖేల్ ట్రైలర్ జనవరి 23న బాల కృష్ణ గారి ఆశీస్సులతో రానుంది” అని ట్వీట్ చేసారు.

టీజర్ రిలీజ్ అయినప్పటినుంచే ఈ సినిమా పై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది అనిపిస్తుంది.

- Advertisement -

కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి మరియు మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఇది ఏస్ డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త ప్రొడక్షన్ వెంచర్. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఈ చిత్రానికి త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ రాశారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు