FriendshipDaySpecial : స్నేహనికి చిరునామాగా నిలిచిన 10 బెస్ట్ సినిమాలు..

FriendshipDaySpecial : ప్రపంచంలో ఎన్నో బంధాలు రక్త సంబంధంతో ఉంటే, ఏ సంబంధం లేకుండా పుట్టి, ఏమైనా త్యాగం చేసే స్నేహబంధం ఎంతో గొప్పది. ఒక మనిషి తన లైఫ్ లో కష్టమొచ్చినపుడు ఎవరికీ చెప్పుకోలేని కొన్ని విషయాలు స్నేహితుడికి చెప్తాడంటే తనకిచ్చే విలువ ఏపాటిదో అర్ధం చేసుకోవాలి. ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రాణత్యాగానికైనా వెనుకాడని ధర్మం స్నేహ ధర్మం. ఏ బంధం లేకున్నా తోడుగా నిలిచే ఆత్మబంధువు స్నేహితుడు. ఇక సినిమా ఇండస్ట్రీ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. పలు చిత్రాలు అత్యంత ప్రజాదరణ దక్కించుకున్నాయి కూడా. అలాంటి ఫ్రెండ్షిప్ సినిమాల్లో బెస్ట్ 10 చిత్రాల గురించి ఓ లుక్కేద్దాం.

Friendship Day Special Top 10 best movies telugu

బాలమిత్రుల కథ (1972)

జగ్గయ్య, కృష్ణంరాజు ప్రధాన పాత్రలలో 1972లో వచ్చిన సినిమా “బాల మిత్రుల కథ”. తమ జీవితంలో జరిగిన ఓ సంఘటన వల్ల జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడకూడదని.. నిజమే జీవిత పరమార్థమని తెలుసుకున్న ఇద్దరు స్నేతిథుల కథ ఇది. 70స్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చే “గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి”.. అనే అద్భుతమైన పాట ఈ సినెమాలోదే.

- Advertisement -

స్నేహం కోసం (1999)

ఫ్రెండ్షిప్ గురించిన సినిమాల్లో అందరికి గుర్తొచ్చే సినిమాల్లో ఈ మూవీ కూడా ఒకటి. స్నేహితుల కోసం ఏమైనా చేసే ఫ్రెండ్స్ ఉంటారని స్నేహానికి కులమత, జాతి బేధాలుండవని ఈ సినిమా చాటిచెప్పింది. 1999లో వచ్చిన ‘స్నేహం కోసం’ చిత్రంలో చిరంజీవి, విజయ్ కుమార్ స్నేహితులుగా నటించగా, ఈ మూవీ క్లైమాక్స్ చాలామంది ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఫ్రెండ్‌షిప్ సినిమాల్లో ఎవర్‌గ్రీన్ అని ఇప్పటికీ ప్రేక్షకులు అంటుంటారు.

పెళ్లి పందిరి (1997)

జగపతి బాబు, పృథ్వీరాజ్ ప్రధానపాత్రల్లో 1997 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “పెళ్లి పందిరి”. తనకు ప్రాణంతో సమానమైన స్నేహితుని కోసం తన ప్రేమను సైతం త్యాగం చేయడానికి సిద్ధం అవుతాడు. ప్రేక్షకులకి ఎంతో ఇష్టమైన “దోస్త్ మేరా దోస్త్” పాట ఈ సినెమాలోదే.

వసంతం (2003)

ఫ్రెండ్స్ అంటే అబ్బాయి, అమ్మాయి కూడా బెస్ట్ ఫ్రెండ్‌ గా ఉంటారని, ఫ్రెండ్షిప్ ఆధారంగా తెరకెక్కిన గొప్ప సినిమా ‘వసంతం’. ఇందులో వెంకటేశ్, కళ్యాణి బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. ఒక అబ్బాయి, అమ్మాయి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. వారి ఫ్రెండ్‌షిప్‌ను వదులుకోకుండా ఎలా కొనసాగించారో ఈ సినిమాలో చూపించారు.

నవ వసంతం (2007)

తరుణ్, ఆకాష్, రోహిత్, సునీల్ స్నేహితులుగా నటించిన ఈ సినిమా మంచి సినిమాగా నిలిచింది. జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్న స్నేహితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వాళ్ళ స్నేహితుడు ఏం చేసాడన్నది కథ.

ప్రేమదేశం (1996)

అబ్బాస్, వినీత్ ఫ్రెండ్స్ గా నటించిన సినిమా ‘ప్రేమదేశం’. ఈ సినిమా కథ ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. కానీ దానికంటే గొప్పగా ఈ సినిమాలో ఫ్రెండ్‌షిప్‌ ను చూపించారు. 1996లో విడుదలయిన ఈ సినిమా లో ‘ముస్తఫా ముస్తఫా’ అనే పాట ఇప్పటికీ ఎవరు గ్రీన్.

నీ స్నేహం (2002)

ఉదయ్ కిరణ్, జతిన్ స్నేహితులుగా నటించిన ఈ సినిమా ఫ్రెండ్షిప్ మూవీస్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుంది. తన కారణంగా ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న ఫ్రెండ్ కోసం తన ప్రేమను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైన స్నేహితుడి కథ ఇది.

ఇద్దరు మిత్రులు (1998)

చిరంజీవి, సాక్షి శివానంద్ స్నేహితులుగా నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ ఫ్రెండ్షిప్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్ ఆడియన్స్ కి కూడా బాగా ఆకట్టుకుంటుంది.

శంభో శివ శంభో (2009)

ఫ్రెండ్ కోసం అతడి ప్రేమ కోసం ఏమైనా చేయడానికి ఫ్రెండ్స్ సిద్ధపడతారని ఈ సినిమాలో చూపించారు. అలాంటి స్నేహితులకు చేదు చెడు స్నేహం కూడా చేస్తే ఎలాంటి ఇబ్బందుల్లో పడతారో ఈ సినిమాలో చూపించారు. రవితేజ, అల్లరి నరేష్, శివ బాలాజీ అందులో ఫ్రెండ్స్ గా నటించారు.

RRR (2022)

ఇక ఈ జెనరేషన్ కి తెలిసిన బెస్ట్ ఫ్రెండ్షిప్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్నో రామ్ చరణ్, ఎన్టీఆర్ స్నేహితులుగా నటించిన ఈ సినిమా నమ్మిన సిద్ధాంతాల కోసం, స్నేహం కోసం ఒకరికోసం ఒకరు ఎంత త్యాగం చేస్తారో చూపించారు ఈ సినిమాలో.

హ్యాపీ డేస్ (2007)

‘హ్యాపీ డేస్’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలేజీ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిఖిల్, రాహుల్, తమన్నా తదితరులు ఫ్రెండ్స్ గా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బెస్ట్ ఫ్రెండ్షిప్ మూవీస్ లో ఒకటి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు