Gabbar Singh 4K : పవన్ ఫ్యాన్స్ కు సడన్ సప్రైజ్, ఇది అవుట్ అఫ్ ది బాక్స్ గురు

Gabbar Singh 4K: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖుషి సినిమా తర్వాత దాదాపు ఒక పదేళ్లు హిట్ సినిమా లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుభవించారు. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను ఎలా చూడాలి అనుకుంటున్నాడు అచ్చం అలా చూపించాడు గబ్బర్ సింగ్ సినిమాలో దర్శకుడు హరీష్ శంకర్. ఈ సినిమా వర్క్ అవుట్ అవ్వడానికి కూడా కారణం స్వతహాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడం.

హరీష్ శంకర్ దర్శకుడుగా చేసిన మూడవ సినిమా గబ్బర్ సింగ్. హిందీ దబాంగ్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా మార్పులు చేర్పులు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పవన్ కళ్యాణ్ లో ఒక 10 ఏళ్లపాటు మిస్ అయిన ఎనర్జీని బయటకు తీశాడు హరీష్. పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఆటిట్యూడ్ కి సరిపడా డైలాగ్స్ ని కూడా ఈ సినిమాలో పెట్టాడు. పవన్ కళ్యాణ్ లోని ఏవైతే అంశాలను జనాలు ఇష్టపడతారో వాటన్నిటిని అద్భుతంగా డిజైన్ చేసి సినిమాలో ఇన్వాల్వ్ చేశాడు.

గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ ఎంత బాగా వర్కౌట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీన్ మొదలైనప్పటినుంచి ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఈ సీన్ లాగ్ అవుతుంది కొంతమేరకు కట్ చేద్దాం అని హరీష్ శంకర్ చెప్పినప్పుడు. ఈ సీన్ ని ట్రిమ్ చేస్తే ఈ సీన్ లో నటించిన మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు అంటూ వద్దు అలానే ఉంచేయండి అని చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఈ సీన్ బోర్ కొట్టకుండా థియేటర్లో అద్భుతంగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మిస్ అయిన జోష్ ఈ సీన్లో బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో చెప్పారు.

- Advertisement -

Gabbar Singh

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాను రీ రిలీజ్ చేసారు. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఇంక తెలుగు ప్రేక్షకులు రీ రిలీజ్ సినిమా అని ఎంతగా సెలబ్రేట్ చేసుకుంటారు అందరికీ తెలిసిన విషయమే. ఇక గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యక్షరి సీన్ వచ్చే టైంకి సంధ్య థియేటర్లో ఈ సీన్ లో పాల్గొన్నవారు రియల్ గా స్క్రీన్ ముందుకు వెళ్లి ఈ సీన్లు క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది చాలా సర్ప్రైజ్ గా అనిపించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు