Gabbar Singh: రీమేక్ సినిమాతో మరొకసారి రికార్డ్స్ మోత

Gabbar Singh: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒకప్పుడు ఒక పండగ రకమైన వాతావరణం ఉండేది. అంత ఈజీగా టికెట్లు దొరికేవి కాదు. ప్రస్తుతం ఆన్లైన్ లో టికెట్లు అవైలబుల్ గా దొరుకుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ని చాలామంది చూడగలుగుతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కొనుక్కోవాలంటే చాలా రికమండేషన్స్ జరిగేవి. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్.

ఖుషి(Khushi) సినిమా తర్వాత పవన్ కెరియర్ లో దాదాపు ఒక పదేళ్ల వరకు హిట్ సినిమా లేదు. ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కానీ మిగులుతున్నాయి. పవన్ కళ్యాణ్ లో మిస్ అయిన ఎనర్జీ మళ్ళీ చూడటానికి గబ్బర్ సింగ్(Gabbar Singh) సినిమా రావాల్సి వచ్చింది. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ కంటే ముందే హరీష్ స్పీచ్ తోనే చాలామందికి ఒక అద్భుతమైన సినిమాను చూడబోతున్నామని నమ్మకం వచ్చింది. స్వతహాగా హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కావడం వలన ఆ సినిమాను అంత బాగా డిజైన్ చేయగలిగాడు.

Gabbar Singh

- Advertisement -

ఇకపోతే ప్రతి హీరో పుట్టినరోజుకి సినిమాలు రీ రిలీజ్ అవ్వటం కామన్ గా జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా తమ్ముడు గుడుంబా శంకర్ వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాను 4k వెర్షన్ లో రీ రిలీజ్ చేయనున్నారు. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభంజనం సృష్టిస్తుంది. కానీ ఈ సినిమా రిలీజ్ కి ముందే రీ రిలీజ్ లో కూడా ఆల్రెడీ నాలుగు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో మరోసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలిసి వచ్చింది అని చెప్పాలి.

ఇకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలి అని అనుకుంటారు అచ్చం అలానే చూపించాడు హరీష్. ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ మేనరిజం డైలాగ్స్ అన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇది ఒక రీమేక్ సినిమా అయినా కూడా అటువంటి ఫీల్ ఎక్కడా లేకుండా కథను అద్భుతంగా డిజైన్ చేశాడు హరీష్. ఇప్పటికీ హరీష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమా అంటే గబ్బర్ సింగ్ అని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు